రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు | request to be recused from His | Sakshi
Sakshi News home page

రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు

Published Thu, Aug 13 2015 5:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు

రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు

* మేడ్చల్ ఎస్‌ఐ సతీష్‌పై భార్య శిరీష ఆరోపణ
* అతని నుంచి రక్షించాలని అభ్యర్థన

రాజమండ్రి క్రైం: తన భర్త, మేడ్చల్ ఎస్‌ఐ సతీష్ రూ. కోటి అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధిస్తున్నాడని రాజమండ్రికి చెందిన శిరీష వాపోయింది. అతడి బారి నుంచి తనకు, తన తండ్రికి రక్షణ కల్పించాలని వేడుకుంది. బుధవారం ఆమె ‘సాక్షి’ మీడియూతో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సతీష్‌కు శిరీషనిచ్చి పెళ్లి చేసినప్పుడు రూ.17 లక్షల కట్నం, నాలుగు అంతస్తుల బిల్డింగ్, ఇతర లాంఛనాలు ఇచ్చారు.

అయితే రూ. కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి రావాలని చెప్పి తొమ్మిదవ రోజునే శిరీషను బయటకు గెంటివేశాడు. తరచూ ఆమెకు ఫోన్‌లు చేసి ఎస్‌ఐగా తన వద్దకు వచ్చే కేసుల నుంచి అక్రమంగా ఎలా సంపాదిస్తున్నదీ వివరించేవాడు. అంత భారీగా సంపాదిస్తున్న తనకు రూ. కోటి కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకువెళతానని చెప్పేవాడు. భర్తతో పాటు అత్త మామలు, ఆడపడుచులు శిరీషను వేధించేవారు. దీంతో శిరీష తన భర్తపై గతేడాది అక్టోబర్ 17న రాజమండ్రి మహిళా పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టింది. కాగా భర్త తనపైనా, తన తండ్రిపైనా తిరిగి అక్రమ కేసులు పెట్టాడని, ఆ ‘క్రిమినల్ ఎస్‌ఐ’ నుంచి తమకు రక్షణ కల్పించాలని శిరీష వేడుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement