లక్నో: శోభా, రీనా, పింకీ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఏం చేసినా ఈ ముగ్గురు కలిసే చేస్తారు. కలిసి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కలిసికట్టుగా ఒకేసారి పెళ్లిపీటలెక్కారు. కానీ విడ్డూరంగా ముగ్గురూ ఒక్కడినే మనువాడారు. ఇది జరిగి 12 సంవత్సరాలు అవుతోంది. అయితే ఉత్తరాదిన ఆచరించే కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకోట్‌కు చెందిన కృష్ణకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు కావడం. ప్రస్తుతం ఈ ముగ్గురికీ చెరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లంతా కలిసి కంసీ రామ్ కాలనీలో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలవుతున్నా ఆ కుటుంబంలో గొడవలు అనేవే లేవట. (చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య)
ఈ కుటుంబం గురించి వాళ్ల బంధువు మాట్లాడుతూ.. " అతడి ముగ్గురు భార్యలు చదువుకున్నవాళ్లు. వాళ్లు ఎప్పుడూ విడిగా ఉందామనుకోలేదు. కలిసి ఉండటంలోనే సంతోషం ఉందని నమ్ముతున్నారు. కానీ కృష్ణ ఒకే వేదికపై ఈ ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్నది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అతడు కూడా దీని గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు" అని చెప్పుకొచ్చారు. ఇక కర్వా చౌత్ సందర్భంగా భర్త సుఖ సంతోషాలు కోరుతూ ముగ్గురు భార్యలు ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడికి పూజలు చేశారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూశారు. ఆ సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: హ్యాపీ కర్వాచౌత్ గౌతం: కాజల్)
Comments
Please login to add a commentAdd a comment