కర్వా చౌత్‌: భార్య కాళ్లు మొక్కిన హీరో | Vikrant Massey Touches Wife Sheetal Thakur Feet On Karwa Chauth, Pics Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vikrant Massey: భార్య పాదాలకు నమస్కరించిన హీరో.. ఫోటో వైరల్‌

Published Mon, Oct 21 2024 8:23 PM | Last Updated on Tue, Oct 22 2024 12:23 PM

Vikrant Massey Touches Wife Sheetal Thakur Feet on Karwa Chauth

ఉత్తరాదిన పాటించే ఆచారం.. కర్వా చౌత్‌. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య రోజంతా ఉపవాసం ఉంటుంది. రాత్రి చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూశాక భోజనం చేస్తారు. సోనాక్షి సిన్హ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అదితి రావు హైదరి, కృతి కర్బందా, కియారా అద్వానీ, పరిణతీ చోప్రా, సోనమ్‌ కపూర్‌, శిల్పా శెట్టి.. ఇలా పలువురు తారలు కర్వాచౌత్‌ జరుపుకున్నారు.

భార్య కాళ్లు మొక్కిన హీరో
12th ఫెయిల్‌ మూవీ హీరో విక్రాంత్‌ మాస్సే దంపతుల కర్వాచౌత్‌ వేడుక మాత్రం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అందరిలాగే విక్రాంత్‌ భార్య, నటి షీతల్‌ గౌతమ్‌ కూడా భర్త ముఖాన్ని జల్లెడలో చూసింది. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. ఆ వెంటనే విక్రాంత్‌ మాస్సే సైతం షీతల్‌ కాళ్లకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలే కాదు గౌరవం అని కూడా ఇట్టే తెలిసిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.

సినిమా..
ఇకపోతే విక్రాంత్‌- షీతల్‌ 2015 నుంచి డేటింగ్‌ మొదలుపెట్టారు. బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కలిసి పని చేశారు. ఏళ్లపాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట 2022లో పెళ్లి పీటలెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో వీరికి పండంటి కుమారుడు జన్మించాడు. అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. హసీన్‌ దిల్‌రుబా, చపాక్‌, గ్యాస్‌లైట్‌, 12th ఫెయిల్‌ సినిమాలతో విక్రాంత్‌ మాస్సే గుర్తింపు సంపాదించుకున్నాడు.

 

 

చదవండి: ఓటీటీలో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement