బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే రిటైర్‌మెంట్ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను నా కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన సమయం వచ్చేసింది. కాబట్టి ఇకపై సినిమాలు చేయను. 2025లో రిలీజవుతున్న సినిమానే నా చివరి మూవీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన డెడికేషన్ దగ్గరుండి చూశా..
అయితే ఇది నిజం కాకపోవచ్చంటున్నాడు నటుడు హర్షవర్ధన్ రానే. జీరో సే రీస్టార్ట్ అనే సినిమా విడుదలకు ముందు విక్రాంత్ ఈ పోస్ట్ పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ రానే మాట్లాడుతూ.. విక్రాంత్ క్లారిటీ ఉన్న మనిషి. హసీనా దిల్‌రుబా సినిమాలో అతడి డెడికేషన్ దగ్గరుండి చూశాను.
మనసు మార్చుకుంటాడని ఆశిస్తున్నా
ఆమిర్ ఖాన్ లాగే అతడు కూడా మళ్లీ సినిమాలు చేస్తాడని ఆశిస్తున్నాను. ఇలాంటి గొప్ప నటులు మన సినిమాకు ఎంతో అవసరం. సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటన అనేది ఎవరో తనతో బలవంతంగా చేయించిన ప్రమోషన్ స్టంట్ అయి ఉంటుంది. అదే నిజం కావాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇకపోతే విక్రాంత్ మాస్సే.. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో జీరోసే రీస్టార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment