Vikrant Massey
-
రెండు రోజుల క్రితమే సినిమాలకు గుడ్ బై.. అప్పుడే సెట్లో ప్రత్యక్షమైన హీరో!
12th ఫెయిల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ చిత్రంలో రాశి ఖన్నా, రిద్ధి డోగ్రాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే విక్రాంత్ మాస్సే రెండు రోజుల క్రితమే సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.కానీ అంతలోనే ఓ మూవీ షూటింగ్ సెట్లో దర్శనమిచ్చాడు విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్ షానాయ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నటనకు బ్రేక్..ఇటీవల తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2025 వరకు మాత్రమే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తన పోస్ట్‌పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురికావద్దని విక్రాంత్ కోరారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
సినిమాలకు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన సబర్మతి రిపోర్ట్ నటుడు!
12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.విక్రాంత్ మాస్సే తన స్టేట్మెంట్లో రాస్తూ.. "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు. -
12th ఫెయిల్ హీరో షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!
స్టార్డమ్ కోసం నటులు పడే కష్టం అంతా.. ఇంతా కాదు. అయితే బుల్లి తెర నుంచి బాలీవుడ్ వెండితెరపైకి చేరి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విక్రాంత్ మాస్సే. పైగా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన అతని ప్రయాణం స్ఫూర్తిదాకయం కూడా.. అలాంటి వ్యక్తి కెరీర్ మంచి పీక్‌లో ఉండగా.. ఊహకందని నిర్ణయంతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. ఏంటిది అర్థాంతరంగా కెరీర్‌కి బ్రేక్ చెప్పడమనేది సరైనదా..! అనే కదా డౌటు. ఆ నిర్ణయం లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే..నచ్చినట్లుగా బతకడం అంటే ఇదే అంటూ విక్రాంత్ అనూహ్య నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు మానసిక నిపుణులు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో హీరోగా ఉండే యత్నం చేశాడని అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకుందాం.. 👉ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రభావితమవ్వుతూనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతలా నా లైఫ్ నాది అన్నట్లుగా ఉంటున్నట్లు నటించినా..చాలావరకు తన వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే భయంతోనే ఇష్టంలేని నిర్ణయాలను తీసుకునే యత్నం చేస్తారు. అలానే జీవిస్తారు కూడా. కొద్ది మందే వ్యక్తిగతానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ల నిర్ణయాలు ఇలా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 👉కెరీర్ ఎంతో ముఖ్యమో.. జీవితం అంతే ముఖ్యం. కొన్ని కెరీర్లు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీని కారణంగా మన స్నేహితులు, మనపై ఆధారపడినవాళ్లు చెప్పుకోలేని బాధకు, అభద్రతాభావానికి గురవ్వుతారు. 👉చాలామంది ఇటు కెరీర్‌ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఒక విధమైన ఒత్తిడికి గురవ్వుతుంటారు కూడా. అలాంటప్పుడూ వాళ్లు తీసుకునే సరైన నిర్ణయాలే వారి జీవితాన్ని ఆనందమయంగా చేస్తాయి. 👉ఇక్కడొక వ్యక్తి ఎదుటి వారి ప్రమేయానికి లోను కాకుండా తనకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నప్పుడే..ఇలా అద్భుతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇక్కడ విక్రాంత్ కూడా అదే పనిచేశారు. 👉చెప్పాలంటే విక్రాంత్‌గా హీరో మంచిగా నిలదొక్కుకోవాల్సిన కీలక టైం. అలాగే ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఓ భర్తగా, తండ్రిగా సరికొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన కీలకమైన సమయం. కుటుంబానికి తన అవసరం ఎంతో ఉంది. 👉కానీ ఇక్కడ విక్రాంత్ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందరూ ఇది కరెక్ట్ కాదని వ్యతిరేకించినా..తనకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా తన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసి హాయిగా ఉండాలనుకున్నాడు. అందుకే ఇలాంటి షాకింగ్‌కి గురిచేసే డేరింగ్ నిర్ణయాన్నితీసుకున్నాడు. 👉ఇది చాలా పెద్ద త్యాగంగా అభివర్ణిస్తారు గానీ, ఇది అలాంటిది కాదు తన బాధ్యతలకు, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతే అలాంటి నిర్ణయానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. 👉ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి, నచ్చినట్లుగా లైఫ్‌ని లీడ్ చేయడానికి ఎంతో గట్స్ ఉండాలి. అలాంటి వాళ్లే అసలైన హీరోలుగా అందరి మనసులలోనూ నిలిచిపోతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన వ్యక్తిగత జీవితం కోసం లేదా సరికొత్తగా కెరీర్లో దూసుకుపోవడానికి అప్పడప్పుడూ ఇలాంటి బ్రేక్ కూడా అవసరమేనని అంటున్నారు నిపుణులు. 👉కొందరికీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉండొచ్చు. అలా అందరికీ సాధ్యం కాదనేది గమనించదగ్గ విషయం. అయితే హీరో విక్రాంత్ త్వరలో తన నిర్ణయం వెనక్కు తీసుకుని మళ్లీ కెరీర్లో దూసుకుపోయే అవకాశం ఉందనేది అంతరంగీక వర్గాల సమాచారం. (చదవండి: జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?) -
సినిమాలకు గుడ్‌బై.. హీరోతో బలవంతంగా చెప్పించారా?
బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే రిటైర్మెంట్ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను నా కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన సమయం వచ్చేసింది. 2025లో రిలీజవుతున్న సినిమానే నా చివరి మూవీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆయన డెడికేషన్ దగ్గరుండి చూశా..అయితే ఇది నిజం కాకపోవచ్చంటున్నాడు నటుడు హర్షవర్ధన్ రానే. జీరో సే రీస్టార్ట్ అనే సినిమా విడుదలకు ముందు విక్రాంత్ ఈ పోస్ట్ పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ రానే మాట్లాడుతూ.. విక్రాంత్ క్లారిటీ ఉన్న మనిషి. హసీనా దిల్రుబా సినిమాలో అతడి డెడికేషన్ దగ్గరుండి చూశాను. మనసు మార్చుకుంటాడని ఆశిస్తున్నాఆమిర్ ఖాన్ లాగే అతడు కూడా మళ్లీ సినిమాలు చేస్తాడని ఆశిస్తున్నాను. ఇలాంటి గొప్ప నటులు మన సినిమాకు ఎంతో అవసరం. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటన అనేది ఎవరో తనతో బలవంతంగా చేయించిన ప్రమోషన్ స్టంట్ అయి ఉంటుంది. అదే నిజం కావాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇకపోతే విక్రాంత్ మాస్సే.. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో జీరోసే రీస్టార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ నటుడు -
సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో ఆయన చేసిన పోస్ట్ అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఆయన భవిష్యత్‌లో ఇక సినిమాలు చేయనని తెలిపారు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.‘కొన్ని సంవత్సరాలుగా మీరు అందరూ నాపై చాలా ప్రేమను చూపించారు. ప్రతి ఒక్కరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు.. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. దీంతో సినిమాలను అంగీకరించడం లేదు. కాబట్టి 2025లో రానున్న సినిమానే నా చివరి సినిమా అవుతుంది. చివరిసారిగా మనం కలవబోతున్నాం. చివరి రెండు సినిమాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు. విక్రాంత్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు'అని ఆయన ఒక పోస్ట్ చేశారు.37 ఏళ్ల వయసులో విక్రాంత్ నటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఎందుకు అలా చేస్తావు.. ? నీలాంటి నటులు ఎవరూ లేరు. మాకు మంచి సినిమా కావాలి" అని తెలుపుతున్నారు. మరొకరు, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో మీ కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నారు...ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నారు.బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. -
ఇంటి మహాలక్ష్మి.. భార్య కాళ్లు మొక్కితే తప్పేంటి? : హీరో
భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు కర్వాచౌత్ పండగ జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జల్లెడలో భర్త ముఖాన్ని చూస్తారు. ఉత్తరాదిన సెలబ్రిటీలందరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే.. భార్య, నటి షీతల్ ఠాకూర్ కాళ్లకు నమస్కరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తనను విపరీతంగా ట్రోల్ చేశారట!భార్య కాళ్లు మొక్కితే..దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ఫోన్లో ఉన్న ఫోటోల్లో నాలుగు బాగా హైలైట్ అయ్యాయి. కొందరికి అవి నచ్చాయి. మరికొందరికి నచ్చకపోవడంతో నానా బూతులు తిట్టారు. ఎందుకలా తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది తప్పేమీ కాదని నా అభిప్రాయం.అది తప్పేం కాదుఆమె నా ఇంటి మహాలక్ష్మి. లక్ష్మీదేవి పాదాలు తాకడం తప్పు కాదు. పదేళ్ల క్రితం నా జీవితంలో అడుగుపెట్టి లైఫ్‌ను అందంగా మార్చిందని గర్వంగా చెప్తాను. తను వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతోంది. మీరెన్ని అనుకున్నా నేను నా భార్య కాళ్లు మొక్కడం మానను అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్కాగా విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. ఇకపోతే విక్రాంత్ మాస్సే.. ద సబర్మతి రిపోర్ట్ అనే సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: అది లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు: హీరో రాకేశ్ కామెంట్స్ -
గోద్రా అల్లర్లపై సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?
నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)2002లో గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!) -
కర్వా చౌత్: భార్య కాళ్లు మొక్కిన హీరో
ఉత్తరాదిన పాటించే ఆచారం.. కర్వా చౌత్. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య రోజంతా ఉపవాసం ఉంటుంది. రాత్రి చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూశాక భోజనం చేస్తారు. సోనాక్షి సిన్హ, రకుల్ ప్రీత్ సింగ్, అదితి రావు హైదరి, కృతి కర్బందా, కియారా అద్వానీ, పరిణతీ చోప్రా, సోనమ్ కపూర్, శిల్పా శెట్టి.. ఇలా పలువురు తారలు కర్వాచౌత్ జరుపుకున్నారు.భార్య కాళ్లు మొక్కిన హీరో12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మాస్సే దంపతుల కర్వాచౌత్ వేడుక మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందరిలాగే విక్రాంత్ భార్య, నటి షీతల్ గౌతమ్ కూడా భర్త ముఖాన్ని జల్లెడలో చూసింది. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. ఆ వెంటనే విక్రాంత్ మాస్సే సైతం షీతల్ కాళ్లకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలే కాదు గౌరవం అని కూడా ఇట్టే తెలిసిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.సినిమా..ఇకపోతే విక్రాంత్- షీతల్ 2015 నుంచి డేటింగ్ మొదలుపెట్టారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశారు. ఏళ్లపాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట 2022లో పెళ్లి పీటలెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో వీరికి పండంటి కుమారుడు జన్మించాడు. అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. హసీన్ దిల్రుబా, చపాక్, గ్యాస్‌లైట్, 12th ఫెయిల్ సినిమాలతో విక్రాంత్ మాస్సే గుర్తింపు సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ -
వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో!
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే ఇప్పడు భారతీయ సినీ ప్రేక్షకులకు అందరికీ పరిచయమే.. 12th ఫెయిల్ సినిమాలో ఐపీఎస్ సాధించాలనే కోరికతో ఒక యువకుడు పోరాటం సాగిస్తాడు. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. దర్శకుడు విధు వినోద్ చోప్రా కూడా చాలా చక్కగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, తాజాగా విక్రాంత్ మస్సే నటించిన సెక్టార్- 36 చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.12th ఫెయిల్, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా అనే చిత్రాలలో నటించి ఫుల్ జోష్‌లో ఉన్న విక్రాంత్ తన తదుపరి సినిమా సెక్టార్ 36తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా మడోక్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా సెక్టార్ 36 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహానగరాల స్లమ్ ఏరియాలో చిన్న పిల్లల అదృశ్యం వెనకున్న మిస్టరీ ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా విక్రాంత్ మస్సే కనిపించబోతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 13న డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియల్ కీలక పాత్రలో నటించారు. -
అమ్మ ఇచ్చిన సలహాతో పెళ్లికి ముందు కలిసున్నాం: హీరో
12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే, నటి షీతల్ ఠాకూర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల ప్రేమ తర్వాత ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరికి పండంటి కొడుకు జన్మించాడు. తాజాగా విక్రాంత్ మాస్సే ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.అమ్మ సలహా వల్లే..నేను నా భార్య కలిసుండి దశాబ్దమవుతోంది. పెళ్లికి ముందు ఎనిమిదేళ్లపాటు డేటింగ్ చేశాం. నా ప్రేమ విషయాన్ని అమ్మకు చెప్పినప్పుడు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోండి. టైం తీసుకోండని చెప్పింది. కలిసుండమని సలహా ఇచ్చింది. అలా సుదీర్ఘకాల డేటింగ్ మాకు బాగా ఉపయోగపడింది. ఈ సమయంలో మేము ఒకరి గురించి మరొకరం పూర్తిగా తెలుసుకోగలిగాం. జీవితాంతం కలిసుండగలమని ఫీలయ్యాం. అన్నీ తెలుసుకున్నాంతను చాలా ముందుచూపుతో వ్యవహరిస్తుంది. అందరిలా ఆంక్షలు పెట్టదు, పట్టింపులకు పోదు. కొన్నాళ్లు కలిసుండండని తను ఇచ్చిన సలహా మాకు బాగా వర్కౌట్ అయింది. కలిసున్నప్పుడు మాలోని నెగెటివ్స్ కూడా తెలుసుకున్నాం. వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకున్నాం అని చెప్పుకొచ్చాడు.కాగా విక్రాంత్ మాస్సే ఇటీవల బ్లాక్ అవుట్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు నటించిన ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా సీక్వెల్ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.చదవండి: రాజమౌళి ‘మోడ్రన్ మాస్టర్స్’ రివ్యూ -
తాప్సీ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' ట్రైలర్ విడుదల
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. 2021లో విడుదలైన ‘హసీన్ దిల్రుబా’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడీ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో వినీల్ మాథ్యూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా భారీగానే ఎదురుచూస్తున్నారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని కొద్దిరోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇప్పడు విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథపై మంచి గ్రిప్పింగ్ ఉండేలా ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు.ఫస్ట్ పార్ట్‌లో భర్త (విక్రాంత్ మాస్సే)తో కలిసి పక్కా ప్లాన్‌తో ప్రియుడిని చంపిన రాణి కశ్యప్(తాప్సీ) ఆపై అక్కడి నుంచి ఆమె పారిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ కేసులో రాణిని తన భర్త కాపాడుతాడా..? అనేది తెలియాలంటే ఆగష్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో తాప్సీ హిట్ సినిమా సీక్వెల్ రెడీ
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. వినీల్ మాథ్యూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని సస్పెన్స్‌కి గురి చేయడమే కాకుండా బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ పేరుతో మళ్లీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మేకర్స్ తాజాగా ప్రకటించారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
విక్రాంత్ మాస్సే.. బాలీవుడ్లో ఎంతోకాలంగా హీరోగా రాణిస్తున్నాడు. అయితే 12th ఫెయిల్ మూవీతో మాత్రం ఒక్కసారిగా ట్రెండయ్యాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనాల్ని పట్టి కుదిపేసింది. ఈ ఒక్క చిత్రంతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాక్ అవుట్. మౌనీ రాయ్ హీరోయిన్గా నటించింది. సునీల్ గ్రోవర్, కరణ్ సోనావానే కీలక పాత్రల్లో అలరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవంగ్ భవసార్ దర్శకత్వం వహించాడు. 2021లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించగా ఇన్నాళ్లకు రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఈ చిత్రం జియో సినిమాలో జూన్ 7 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది. Iss kahani ke sabhi patra ki life ke 🤫 lag chuke hai…!#StayTuned for more details about their life 🧐Subscribe to JioCinema Premium at Rs.29 per month.Exclusive content. Ad-free. Any device. Up to 4K.@VikrantMassey @Roymouni @WhoSunilGrover @focusedindian #JyotiDeshpande… pic.twitter.com/zCy7Uuqz1c— JioCinema (@JioCinema) May 16, 2024చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
క్యాబ్ డ్రైవర్‌తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్‌ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్‌లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా! -
ప్రేమ అనేది వ్యసనం.. అందుకే ఇలా అంటూ స్టార్ హీరో
‘12th ఫెయిల్’ సినిమాతో నటుడు విక్రాంత్ మాస్సే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యారు. నటి శీతల్ ఠాకూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వారికి మొదటి బిడ్డ జన్మించింది. బాబుకు వర్దాన్ అని పేరు పెట్టారు. కుమారుడిపై ప్రేమతో విక్రాంత్ మాస్సే తన కుమారుడి పేరును 'వర్దాన్' చేతిపై తాజాగా టాటూగా వేపించాడు. ఆ చిత్రాన్ని తన అభిమానులకు పంచుకున్నాడు. ఫిబ్రవరి 7న వారికి వర్దన్ పుట్టినప్పటి నుంచి ఈ జంట మరింతి ఉత్సాహంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన టాటూతో పాటు తన కుమారుడిపై ప్రేమను పంచుకున్నాడు. ఇక నుంచి భార్యత పాటు కుమారుడికి కూడా తన ప్రేమను పంచాలని తెలిపాడు. ప్రేమ అనేది వ్యసనం లాంటిదని చెప్పుకొచ్చాడు. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. ‘12th ఫెయిల్’ చిత్రం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట, మొదట ఫిబ్రవరి 14, 2022న వివాహం చేసుకున్నారు. తరువాత, ఫిబ్రవరి 18, 2022 న శీతల్ ఠాకూర్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్లో కనిపించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడింది. 2020లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి వివాహం ఆలస్యమైంది. సుమారు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టింది. విక్రాంత్ ప్రస్తుతం ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రూబా , ముంబైకర్ , సెక్టార్ 36, యార్ జిగ్రీ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
ఆ ఒక్క సినిమాతో ప్రతిష్టాత్మక అవార్డ్ కొట్టేసిన నటుడు!
చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్లో ఈ అవార్డ్‌ను బహుకరించారు. కాగా.. ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్‌లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్
'12th ఫెయిల్' హీరో క్షమాపణ చెప్పాడు. అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ని డిలీట్ చేయడంతో పాటు అప్పుడు జరిగిన విషయమై అసలేం జరిగిందో వివరణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్.. అర్థరాత్రి చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు సారీ చెప్పాడు? హిందీ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సే.. ఆ తర్వాత బుల్లితెర నుంచి సినిమా స్క్రీన్‌కి షిఫ్ట్ అయ్యాడు. కాకపోతే సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదే టైంలో ఓటీటీలో 'మీర్జాపుర్' లాంటి వెబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. గతేడాది చివర్లో '12th ఫెయిల్' మూవీతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) అయితే విక్రాంత్ 2018లో చేసిన ఓ ట్వీట్‌ని నెటిజన్లు బయటకు తీశారు. రాముడు-సీత కార్టున్తో ఉన్న ఈ ట్వీట్.. హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కొందరు విమర్శలు చేశారు. దీంతో సదరు ట్వీట్‌ని డిలీట్ చేసిన ఈ హీరో.. దీనికి ప్రతిగా క్షమాపణలు కూడా చెప్పాడు. '2018లో నేను కొన్ని ట్వీట్ చేశా. ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను. హిందు కులాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. కానీ నేను చేసిన ట్వీట్ అలా అర్థం వచ్చేలా ఉండటం నాకు బాధ కలిగించింది. పేపర్లో వచ్చిన కార్టూన్‌నే నేను పోస్ట్ చేశాను. కానీ ఎవరైతే ఈ ట్వీట్ వల్ల బాధపడ్డారో వాళ్లందరికీ నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అందరూ తప్పులు చేస్తాను. ఇప్పుడు నేను చేశాను' అని విక్రాంత్ మస్సే తన ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) Deleted + Apology 🙏🔱🚩 pic.twitter.com/LkYOcaFxVp — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) February 20, 2024 In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words: It was never my intention to hurt, malign or disrespect the Hindu community. But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could… — Vikrant Massey (@VikrantMassey) February 20, 2024 -
నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో
'12th ఫెయిల్' సినిమా మీలో ఎంతమంది చూశారు? ఈ మూవీలో హీరో ఎన్నో కష్టాల్ని తట్టుకుని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. దీంతో సినిమా సూపర్‌హిట్ అయింది. అయితే ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మస్సే నిజ జీవితంలోనూ ఇలాంటి కష్టాలే పడ్డాడంట. స్వయంగా ఇతడే ఆ విషయాలన్నీ బయటపెట్టాడు. లక్షలు సంపాదించే స్థాయి నుంచి భార్య ఇచ్చిన డబ్బులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. ఓటీటీల్లో వచ్చిన పలు సినిమాలు-వెబ్ సిరీసుల వల్ల విక్రాంత్ మస్సే.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమయ్యాడు. అయితే మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇతడు పలు సీరియల్స్‌లో హీరోగా నటించాడు. అప్పట్లోనే నెలకు దాదాపు రూ.35 లక్షలకు పైనే సంపాదించాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా వెండితెరపై నటుడు కావాలనుకున్నప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే సీరియల్స్‌ని వదులుకున్నాడు. దీంతో ఇంట్లో ఖర్చులకు సరిపోలేదు. ఆడిషన్స్‌కి వెళ్దామంటే డబ్బుల్లేవు. ఇలాంటి టైంలోనే విక్రాంత్‌కి ప్రస్తుతం భార్యగా ఉన్న శీతల్ ఠాకుర్ సాయం చేసింది. దాదాపు నాలుగైదు నెలలు ఖర్చులకు డబ్బులిచ్చి ఆదుకుంది. అలా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే క్రమంలో ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డ విక్రాంత్.. ఓటీటీ ట్రెండ్ వల్ల మంచి మంచి పాత్రలు చేసి బోలెడంత పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య '12th ఫెయిల్' చిత్రంతో సినిమాల్లో హీరోగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో నిజ జీవిత కష్టాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ కూతురి పెళ్లి.. అధికారిక ప్రకటన) -
ఆ రికార్డ్ అందుకున్న ఏకైక ఇండియన్ చిత్రంగా '12th Fail'
అనురాగ్ పాథక్ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్ IMDb రేటింగ్ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం 69వ 'ఫిలిం ఫేర్' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12Th ఫెయిల్ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్డేట్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనోజ్ జీవిత కథను ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ 12Th ఫెయిల్ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్లో గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 12th ఫెయిల్ హీరో
12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే గుడ్‌న్యూస్ చెప్పాడు. తన భార్య షీతల్ ఠాకూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. బుధవానం (ఫిబ్రవరి 7న) సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు విక్రాంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అప్పుడే లవ్‌లో పడ్డారు 12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ సైతం కంగ్రాట్స్ అంటూ అతడి పోస్ట్ కింద కామెంట్ పెట్టింది. కాగా షీతల్ కూడా పలు సినిమాల్లో నటించింది. వీరిద్దరూ బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామోచ్ అంటూ షీతల్ గర్భవతి అయిన విషయాన్ని బయటపెట్టారు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి.. కాగా విక్రాంత్ మాస్సే నేరుగా సినిమాల్లో అడుగుపెట్టలేదు. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్ చేశాడు. ధరమ్ వీర్, బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు), గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్.. ఇలా పలు ధారావాహికల్లో నటించాడు. తర్వాత అక్కడ వచ్చిన క్రేజ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. లూటేరా, దిల్ ధడక్నే దో, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు. ఎ డెత్ ఇన్ ద గంజ్‌తో హీరోగా మారాడు. ఈ మూవీ అతడి జీవితాన్నే మార్చేసింది. అప్పటినుంచి డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. 12th ఫెయిల్ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు (క్రిటిక్స్ విభాగంలో) అందుకున్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: ఆ తమన్ అబద్ధాలే చెప్తాడు.. నేను అలా ఒక్కసారే చేశా! -
12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం.. !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. Such a memorable time @anupamachopra ! Thanks so much to #VidhuVinodChopra for bringing his fabulous #12Fail to #Macao #China for Asia-Europe Festival of Young Cinema.The universal theme really resonated with young Chinese audiences (& in our festival world #Restart is key! ) 👍 https://t.co/B6vlsZwMWF — Deepti DCunha (@deemelinda) January 12, 2024 -
12th ఫెయిల్.. అరుదైన ఘనత, హాలీవుడ్ సినిమాలనూ వెనక్కు నెట్టేసింది!
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు కానీ.. మౌత్ టాక్ ద్వారా బాగా పుంజుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. కానీ ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది. గతేడాది హాలీవుడ్లో రిలీజైన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్(8.6), ఓపెన్‌హైమర్(8.4), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3(7.9), కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్(7.8), జాన్ విక్ చాప్టర్ 4(7.7) లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్(9.2) మూవీ సొంతం చేసుకుంది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో 12th ఫెయిల్ మూవీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్
ఈ హిట్ సినిమా కోసం మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఏంటి ఈ మూవీ అంత బాగుంటుందా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. స్పూర్తినిచ్చే చిత్రాల జాబితాలో ఈ మూవీ నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అనుకోని విధంగా ఆడియెన్స్‌కి సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొనే చూసేయొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్) హిందీలో పిచ్చి పిచ్చి కమర్షియల్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు మంచి భావోద్వేగభరిత చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన అద్భుతమైన మూవీ '12th ఫెయిల్'. నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీలో ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్.. చాలామందికి కంటతడి పెట్టించింది. అక్టోబరు 27న హిందీలో రిలీజైన ఈ సినిమా.. నవంబరు 3న తెలుగు వెర్షన్ విడుదలైంది. కాకపోతే అదే రోజు 'పొలిమేర 2', 'కీడాకోలా' లాంటి చిత్రాల వల్ల దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. అలా మంచి కంటెంట్ ఉన్నాసరే ప్రేక్షకులకు తెలియకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి మాయమైపోయింది. అలా ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబరు 29 నుంచి హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. సో వచ్చేవారం ఓటీటీ మూవీస్‌లో దీన్ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) -
12th Fail Movie Review: 12th ఫెయిల్ మూవీ రివ్యూ
టైటిల్: 12th ఫెయిల్ నటీనటులు: విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ తదితరులు నిర్మాత: విధు వినోద్ చోప్రా దర్శకత్వం: విధు వినోద్ చోప్రా సంగీతం: శంతను మొయిత్రా సినిమాటోగ్రఫీ: రంగరాజన్ రామబద్రం విడుదల తేది: నవంబర్ 3, 2023 ఒక భాషలో సినిమా హిట్ అయిందంటే చాలు దాన్ని పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అలా బాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రమే 12th ఫెయిల్. అక్టోబర్ 27న హిందీలో రిలీజైన ఈ చిత్రం.. అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో అదే టైటిల్‌తో నవంబర్ 3 తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూవీ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథ 1997లో ప్రారంభం అవుతుంది. బందిపోట్లకు నిలయమైన చంబల్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ(విక్రాంత్ మెస్సీ) ఇంటర్ చదవుతుంటాడు. 12వ తరగతి పాస్ అయితే చిన్న ఉద్యోగం వస్తుందని అతని ఆశ. అందరిలాగే తాను కూడా చిట్టిలు కొట్టి పరీక్షలు పాస్ అవ్వాలనుకుంటాడు. అయితే అక్కడకు కొత్తగా వచ్చిన డీఎస్పీ దుష్యంత్ సింగ్(ప్రియాన్షు ఛటర్జీ).. విద్యార్థులు కాపీ కొట్టడాన్ని అరికడతాడు. దీంతో ఆ ఏడాది మనోజ్ 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు.మరోవైపు ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అన్నయ్యతో కలిసి ఆటో తోలుతూ ఉంటాడు. ఓసారి ఎమ్మెల్యే మనుషుతో గొడవపడిన కారణంగా తన అన్నయ్యను జైలులో పెడతారు పోలీసులు. ఆయన్ని బయటకు రావడానికి డీఎస్పీ దుష్యంత్ సహాయం చేస్తాడు. దుష్యంత్ సిన్సియారిటీ చూసి..తాను కూడా అలాంటి పోలీసాఫీసర్ అవ్వాలనుకుంటాడు మనోజ్. దుష్యంత్‌ను ఇన్స్పైరింగ్గా తీసుకొని కాపీ కొట్టకుండా 12th పాస్ అవుతాడు. డిగ్రీ పూర్తి చేసి.. డీఎస్పీ కావాలని, కోచింగ్ కోసం నానమ్మ ఇచ్చిన పెన్షన్ డబ్బులతో పట్నం వెళ్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో అతని డబ్బులను కొట్టేసారు. మరోవైపు సిటీకి చేరుకున్నాక.. మూడేళ్లదాక నోటీఫికేషన్ లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న మనోజ్‌కు.. ప్రీతమ్ పాండే(ఆనంత్ విజోషి) పరిచయం అవుతాడు. ఆయన సపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో మనోజ్ సివిల్స్ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నాడు? ఢిల్లీలో పరిచయం అయిన గౌరీ అన్న(ఆయుష్మాన్ పుస్కర్), శ్రద్ధా(మేధా శంకర్) ఎలాంటి సపోర్ట్‌ని అందించారు? చివరకు ఐపీఎస్ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. జీవితంలో ఫెయిల్యూర్స్, కష్టాలు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం మన సొంతం అవుతుందని చాటి చెప్పే ఇన్స్పైరింగ్ మూవీ. చంబల్ ప్రాంతంలోని అప్పటి పరిస్థితులు, అక్కడి విద్యా వ్యవస్థను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నిజాయితీ కారణంగా తండ్రి ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వడం.. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ పడే కష్టాలకు సంబంధించిన సన్నీవేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో సాగిస్తూనే.. చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మనోజ్ కోచింగ్ కోసం పట్నం వెళ్లిన తర్వాత కథ ఎమోషనల్వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బులు లేక ఆయన పడే కష్టాలు.. హోటల్‌కి వెళ్లి అన్నం అడిగిన తీరు.. మనసుని కదిలిస్తాయి. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల కోచింగ్ కోసం పేద విద్యార్థులు పడే కష్టాలను తెరపై వాస్తవికంగా చూపించారు. సెకండాఫ్‌లో కథ మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. కోచింగ్‌కి డబ్బుల్లేక మనోజ్ బాత్రూమ్స్ కడగడం.. పిండిమర ఇంట్లో ఉంటూ.. రోజుకు 15 గంటలు పని చేస్తూ చదవుకోవడం... పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతిసారి మనోధైర్యంతో ‘రిపీట్’ అంటూ మళ్లీ చదవడం ప్రారంభించడం..ఈ సన్నివేశాలన్నీ హృదయాలను హత్తుకుంటాయి. విధూ వినోద్ తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తూ.. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేశాడు. ఎవరెలా చేశారంటే.. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మెస్సీ ఒదిగిపోయాడు. తెరపై మనకు మనోజ్ కుమార్ పాత్రే కనిపిస్తుంది తప్ప..ఎక్కగా విక్రాంత్ కనిపించడు. అంతలా తనదైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కొన్నిచోట్ల నవ్విస్తూనే.. మనల్ని ఏడిపించేస్తాడు. మనోజ్ స్నేహితుడు పాండేగా ఆనంత్ వీ జోషి నటన చాలా బాగుంది. కథంతా అతని పాత్రనే నెరేట్ చేస్తుంది. గౌరీ పాత్రలో ఆయుష్మాన్ పుస్కర్ నటన ఆకట్టుకుంటుంది. మనోజ్ ప్రియురాలు శ్రద్దాగా మేధా శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక సుందర్‌గా విజయ్ కుమార్, డీఎస్పీగా ప్రియాంశు చటర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. శాంతను మోయిత్రా సంగీతం సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. కెమెరామెన్ పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్ నీట్‌గా వాస్తవాన్ని ఆవిష్కరించేలా సహజసిద్ధంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటని చెప్పొచ్చు. విద్యార్థులకు ఇదొక ఇన్స్పైరింగ్ మూవీ. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్