బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్‌ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్‌లో దిగబెట్టాను.
ఈ నాటకాలు నా దగ్గర కాదు
కానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు.
అది నా తప్పా?
ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్‌లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.
తప్పే లేదు
గమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment