అమ్మ ఇచ్చిన సలహాతో పెళ్లికి ముందు కలిసున్నాం: హీరో | Vikrant Massey: My Mom Recommended This Before Marriage | Sakshi
Sakshi News home page

నటితో ఎనిమిదేళ్లపాటు డేటింగ్‌.. అమ్మ సలహా వల్లే..: 12th ఫెయిల్‌ హీరో

Published Wed, Aug 7 2024 1:16 PM | Last Updated on Wed, Aug 7 2024 1:16 PM

Vikrant Massey: My Mom Recommended This Before Marriage

12th ఫెయిల్‌ హీరో విక్రాంత్‌ మాస్సే, నటి షీతల్‌ ఠాకూర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల ప్రేమ తర్వాత ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరికి పండంటి కొడుకు జన్మించాడు. తాజాగా విక్రాంత్‌ మాస్సే ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అమ్మ సలహా వల్లే..
నేను నా భార్య కలిసుండి దశాబ్దమవుతోంది. పెళ్లికి ముందు ఎనిమిదేళ్లపాటు డేటింగ్‌ చేశాం. నా ప్రేమ విషయాన్ని అమ్మకు చెప్పినప్పుడు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోండి. టైం తీసుకోండని చెప్పింది. కలిసుండమని సలహా ఇచ్చింది. అలా సుదీర్ఘకాల డేటింగ్‌ మాకు బాగా ఉపయోగపడింది. ఈ సమయంలో మేము ఒకరి గురించి మరొకరం పూర్తిగా తెలుసుకోగలిగాం. జీవితాంతం కలిసుండగలమని ఫీలయ్యాం. 

అన్నీ తెలుసుకున్నాం
తను చాలా ముందుచూపుతో వ్యవహరిస్తుంది. అందరిలా ఆంక్షలు పెట్టదు, పట్టింపులకు పోదు. కొన్నాళ్లు కలిసుండండని తను ఇచ్చిన సలహా మాకు బాగా వర్కౌట్‌ అయింది. కలిసున్నప్పుడు మాలోని నెగెటివ్స్‌ కూడా తెలుసుకున్నాం. వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకున్నాం అని చెప్పుకొచ్చాడు.

కాగా విక్రాంత్‌ మాస్సే ఇటీవల బ్లాక్‌ అవుట్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు నటించిన ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా సీక్వెల్‌ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది.

చదవండి: రాజమౌళి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement