కర్వా చౌత్‌; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ కామెంట్‌ | Karwa Chauth: Raj Kundra Shares Meme Feat On Shilpa Shetty | Sakshi
Sakshi News home page

కర్వా చౌత్‌; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ జోక్‌

Published Wed, Nov 4 2020 12:08 PM | Last Updated on Wed, Nov 4 2020 12:49 PM

Karwa Chauth: Raj Kundra Shares Meme Feat On Shilpa Shetty - Sakshi

సంసృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఆచారాలు, కట్టుబాట్లకు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి సంప్రదాయల్లో భర్త మంచి కోసం భార్య చేసే ఉపవాసం కూడా ఒకటి.. దీనినే కర్వా చౌత్‌ అంటారు. దక్షిణాదినా దీనికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తనతో ఏడడుగులు వేసి, జీవితాంతం కలిసుండే వ్యక్తి కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ భార్యలు ఈ రోజు ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేస్తారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూస్తారు. అయితే ఈ కర్వా చౌత్ సందర్భంగా మహిళలు తమ చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. తమ జీవితం కూడా భర్తతో అదే విధంగా రంగులమయం కావాలని ఆకాంక్షిస్తారు. చదవండి: 'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా'

ఈ ఏడాది కర్వా చౌత్ నవంబర్ 4న వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. నటి శిల్పా శెట్టి తన భర్త కోసం ప్రతి ఏడాది ఉపవాసం ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు తన హాస్య చతురతో అందరిన నవ్వించే రాజ్‌ కుంద్రా ఓ మీమ్‌ షేర్‌ చేశారు. ఇందులో తన కోసం ఉపవాసం చేస్తున్న భార్య, నటి శిల్పా శెట్టి ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ఈ రోజు తన భార్య జల్లెడ సాయంతో తన ముఖాన్నే చూస్తుందని ప్రతి భర్త  ఊహించుకుంటాడు. కానీ వాస్తవానికి ఆమెకు అద్దంలో ఆ తరువాత ఏం తినాలో అవి కనిపిస్తాయి’. అంటూ సరదా కామెంట్‌ చేశారు. అదే విధంగా నటి కియారా అద్వానీ కూడా ఈ పండగ రోజు మెహెందీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే కియారాకు ఇంకా వివాహం కాలేనందున ఆమె తన తల్లికి మెహెందీ పెట్టడం ద్వారా కర్వా చౌత్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement