భర్తల క్షేమం కోసం భార్యలు కడుపు మాడ్చుకోవడం అనాచారం’’ అంటున్నారు బాలీవుడ్ భామ కరీనా కపూర్. భర్తల బాగుకోసం భార్యలు ఉత్తరాదిన జరిపే పండుగ ‘కడవా చౌథ్’. ఆ రోజు భార్యలందరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. జల్లెడలో చందమామను చూసి తమ ఉపవాస దీక్షను ముగిస్తారు. ఇటీవల ఆ పండగ సందర్భంలోనే కరీనా ముంబైలోని ఓ ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘భర్తను దైవంగా భావించడం తప్పుకాదు. అందుకని తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మాత్రం తప్పు. నా భర్త క్షేమం నాకు ముఖ్యమే. ఆయన్ను బాగా చూసుకోవాలంటే ముందు నా ఆరోగ్యం బాగుండాలి కదా. నేను కపూర్‌ని. మా వంశం మొత్తం భోజనప్రియులే. ఫుడ్ తినకుండా మేం ఉండలేం. హాయిగా తింటాను. అలాగే... కష్టపడి నా సినిమాలకు పనిచేస్తాను.అన్నం పెట్టే వృత్తి కూడా దైవమే కదా. సైఫ్ కూడా ఇలాంటి విషయాలను పెద్దగా ఇష్టపడడు’’ అని చెప్పుకొచ్చారు.
నేను కపూర్ అమ్మాయిని...కడుపు మాడ్చుకోలేను
Published Wed, Oct 23 2013 1:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement