![Kajal Aggarwal and Gautam Kitchlu prep for first Karwa Chauth - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/5/kajal-aggarwal-gautam-kitch.jpg.webp?itok=eVPqrztP)
ఇలా పెళ్లయిందో లేదో అలా కొత్తింట్లోకి అడుగుపెట్టారు కాజల్, గౌతమ్. అక్టోబర్ 30న పెళ్లయింది. బుధవారం గృహప్రవేశం అయ్యారు. అలాగే తొలి పండగ కూడా చేసుకున్నారు. ఉత్తరాదిన ఆచరించే కర్వా చౌత్ పండగను బుధవారం జరుపుకున్నారు. భర్త క్షేమం కోసం స్త్రీలు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకూ ఉపవాసం ఉండి, పూజలు చేస్తారు. భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక ఉపవాసాన్ని విరమిస్తారు. ఎరుపు రంగు డిజైనర్ శారీ, ఎరుపు రంగు మాస్క్‌తో కర్వా చౌత్ స్పెషల్ అంటూ కాజల్ ఒక ఫొటోను షేర్ చేశారు. అలాగే కొత్తింట్లోకి అడుగుపెట్టిన సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘నా ప్రియమైన భార్యతో’ అన్నారు గౌతమ్ కిచ్లు.
Comments
Please login to add a commentAdd a comment