Indias Got Talent
-
ఛీ.. ఇదా మీరిచ్చే గౌరవం.. శిల్పా శెట్టి, బాద్షాపై నెటిజన్ల ఫైర్
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్‌లతో హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) 'ఈ జడ్జ్‌లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్‌ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
Kirron Kher: గ్రేట్ కమ్ బ్యాక్ గెలుపు కిరణం.. ‘ఆమె ఫైటర్. అంతే’!
Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్ ఠాకూర్ సింగ్ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్ ఖేర్’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్‌ఖేర్ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్ ఖేర్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్ ఖేర్ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ లవ్’ ఎప్పటిలాగే చీర్‌ఫుల్ వాయిస్! చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చండీగఢ్‌కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్‌కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సెట్లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు. ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్ ఖేర్ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్‌జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!
అమృతసర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు సులేమాన్ ఫ్లూట్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లూట్ భక్తులు సులేమాన్ ట్యూన్ ని ఫాలో అయిపోతున్నారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్ 7' షోలో ప్రేక్షకుల ఓటింగ్ తో శనివారం రాత్రి విజేతగా అవతరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7 ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు కిరణ్ ఖేర్, నటి మలైకా అరోరా ఖాన్ లు ఈ షోకు జడ్జిలు గా వ్యవహరించారు. ఈ నెల 9న జరిగిన గ్రాండ్ ఫైనల్లో నలుగురితో పోటీ పడిన సల్మాన్ వీక్షకుల ఆశీర్వాదంతో సీజన్7 విన్నర్ గా అవతరించాడు. సులేమాన్ తల్లిదండ్రులు కూడా మ్యూజిషియన్స్ కావడంతో చిన్ననాటి నుంచే అతనికి ఫ్లూట్ ను నేర్పించినట్లు చెప్పారు. మూడేళ్ల వయసులో సులేమాన్ సాధనను ప్రారంభించాడని, ఆ తర్వాత అతన్ని పీటీ హరిప్రసాద్ చౌరాసియా వద్ద శిక్షణకు పంపుతున్నట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతానని సులేమాన్ చెప్పారు. -
డ్యాన్స్ మ్యాజిక్...
నృత్యంతో మంత్రముగ్ధుల్ని చేయడం అంటే ఏమిటో... ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. డ్యాన్సర్లు తమ దేహాన్ని స్ప్రింగ్‌లా మెలికలు తిప్పుతుంటే సందర్శకులు తమ కళ్లు ఆర్పడం మరిచిపోయారు. ఇండియాస్ గాట్ టాలెంట్ ద్వారా ఫేమస్ అయిన ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్‌తో కూకట్‌పల్లిలోని సుజనా మాల్లో శనివారం వీకెండ్ షో నిర్వహించారు. గణపతి ప్రార్థనతో మొదలైందీ బృంద నృత్యం. కృష్ణ లీల, దశావతారాలు... ఇలా పురాణేతిహాసాలలోని ఘట్టాలకు నృత్యవిన్యాసాల జోడింపుతో కనువిందుగా సాగి ఆహూతుల హ్యాట్సాఫ్స్ అందుకుంది. -
‘ఇండియా గాట్ టాలెంట్’ను వదులుకోను
న్యూఢిల్లీ: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాలెంట్ షోగా ప్రసారమవుతున్న ‘ఇండియా గాట్ టాలెంట్’ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న కిరణ్ ఖేర్ ఇకపై కూడా ఆ స్థానంలో కొనసాగుతానని చెబుతున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చండీగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీగా బాధ్యతలు పెరగడంతో ఇకపై టాలెంట్ షోలో పాల్గొంటారా? లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘కార్యక్రమాన్ని చూస్తూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నేనూ అంతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై కూడా న్యాయనిర్ణేతగానే కొనసాగుతాను. మిగతా సమయాన్నంతా చండీగఢ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయిస్తాను. ఎన్నికల ప్రచార సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. నా ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ప్రచారం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రోజుకు కేవలం ఐదుగంటలు మాత్రమే నిద్రపోయాను. మిగతా సమయాన్ని ప్రచారం కోసం కేటాయించాను. అందుకే కార్యక్రమాన్ని కొన్నిరోజుల కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఇకపై న్యాయనిర్ణేతగా కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీదే. పార్టీ అధిష్టానం నాపై మరిన్ని బాధ్యతలు మోపితే వాటిని కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం కష్టం కావొచ్చు. కేవలం ఎంపీగా బాధ్యలు మాత్రమే నాపై ఉంటే అటు ప్రజలకు సేవ చేయడంతోపాటు న్యాయనిర్ణేతగా కొనసాగడం కష్టమేమీ కాదనుకుంటున్నా. అయితే దీనిపై స్పష్టత మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశముంద’న్నారు.