13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు! | Meet flute player Suleman, the 13-year-old winner of India’s Got Talent 7 | Sakshi
Sakshi News home page

13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!

Published Sun, Jul 10 2016 12:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!

13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!

అమృతసర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు సులేమాన్ ఫ్లూట్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లూట్ భక్తులు సులేమాన్ ట్యూన్ ని ఫాలో అయిపోతున్నారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్ 7' షోలో ప్రేక్షకుల ఓటింగ్ తో శనివారం రాత్రి విజేతగా అవతరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7 ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు కిరణ్ ఖేర్, నటి మలైకా అరోరా ఖాన్ లు ఈ షోకు జడ్జిలు గా వ్యవహరించారు.

ఈ నెల 9న జరిగిన గ్రాండ్ ఫైనల్లో నలుగురితో పోటీ పడిన సల్మాన్ వీక్షకుల ఆశీర్వాదంతో సీజన్7 విన్నర్ గా అవతరించాడు. సులేమాన్ తల్లిదండ్రులు కూడా మ్యూజిషియన్స్ కావడంతో చిన్ననాటి నుంచే అతనికి ఫ్లూట్ ను నేర్పించినట్లు చెప్పారు. మూడేళ్ల వయసులో సులేమాన్ సాధనను ప్రారంభించాడని, ఆ తర్వాత అతన్ని పీటీ హరిప్రసాద్ చౌరాసియా వద్ద శిక్షణకు పంపుతున్నట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతానని సులేమాన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement