suleman
-
18 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. అక్కడే తుదిశ్వాస
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టర్మినల్’ హిట్ సినిమాకు స్ఫూర్తి అయిన ఇతని పేరు మెహ్రాన్ కరిమి నసీరి. ఇరాన్‌లోని మస్జీద్ సులేమాన్ సిటీలో పుట్టాడు. బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్ నిరాకరించింది. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్ తన తల్లి స్వస్థలం గనుక తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది. ఆ సమయానికి పారిస్‌లోని చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెహ్రాన్ అక్కడే ఆగిపోయాడు. ఇక దాన్నే తన స్థిరనివాసంగా మార్చుకున్నాడు. ఏకంగా 18 ఏళ్లు అక్కడే గడిపాడు! అనారోగ్యంతో కొన్నేళ్లు బయటికెళ్లినా ఇటీవల మళ్లీ తిరిగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. శనివారం తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. అలా... ఎన్నో ఏళ్లుగా గడపిన విమానాశ్రయంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు!! -
మీరెక్కడున్నా సరే వచ్చి తీరుతుంది!
సులైమాన్ (అలైహిస్సలామ్) దర్బారులో ఒక వ్యక్తి కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాడు. అంతలోనే మృత్యుదూత ప్రత్యక్షమయ్యాడు. సులైమాన్ పక్కనే కూర్చుని ఉన్న వ్యక్తివంక పట్టి పట్టి చూశాడు. ఆ వ్యక్తి భయంతో వణకుతూ ‘‘ప్రవక్తా! ఆ మృత్యుదూత నన్నదోలా చూస్తున్నాడు. చూడబోతే అతను నా ప్రాణాలు తోడేసేలా ఉన్నాడు. మీ మహిమతో నన్ను ఈ దేశ సరిహద్దులు దాటించి ఓ నిర్మానుష్య అడవులకు పంపించండి’’ అని వేడుకున్నాడు. హజ్రత్ సులైమాన్ వాయువులతో ‘‘ఈ వ్యక్తిని భారతదేశ సరిహద్దుల్లోని ఫలానా అడవులకు తీసుకువెళ్లండి’’ అని ఆజ్ఞాపించిన క్షణాల వ్యవధిలోనే ఆ వ్యక్తి అడవుల్లో ఉన్నాడు. ఆ అడవుల్లో కాలుమోపిన కాసేపటికే అతను మృత్యువాతపడ్డాడు. కొన్నిరోజుల తరువాత హజ్రత్ సులైమాన్ తన దర్బారులోకి వచ్చిన మృత్యుదూతతో ‘‘ఆ రోజు ఆ వ్యక్తివంక ఎందుకలా చూశావు?’’ అని అడిగారు. దానికి మృత్యుదూత ‘‘తెల్లారితే ఆ వ్యక్తి ప్రాణాలు ఫలానా అడవిలో తోడేయాలని నాదగ్గర ఉన్న చిట్టాలో రాసి ఉంది. అతనేమో మీ సమక్షంలో కూర్చుని ఉండేసరికి ఆశ్చర్యమేసింది. అంతలోనే తను మీతో మొరపెట్టుకోవడం... తాను ఎక్కడైతే చావాలని ఉందో అక్కడికే అతను చేరడం తమరికి తెలిసిందే’’ మృత్యువు, మీరు ఎక్కడున్నాసరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే... – ముహమ్మద్ ముజాహిద్ -
కాకతీయ కాలువలో పడి యువకుడి మృతి
బాల్కొండ: ప్రమాదవశాత్తూ కాకతీయ కాలువలో పడి సులేమాన్ ఖాన్(19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!
-
13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!
అమృతసర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు సులేమాన్ ఫ్లూట్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లూట్ భక్తులు సులేమాన్ ట్యూన్ ని ఫాలో అయిపోతున్నారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్ 7' షోలో ప్రేక్షకుల ఓటింగ్ తో శనివారం రాత్రి విజేతగా అవతరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7 ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు కిరణ్ ఖేర్, నటి మలైకా అరోరా ఖాన్ లు ఈ షోకు జడ్జిలు గా వ్యవహరించారు. ఈ నెల 9న జరిగిన గ్రాండ్ ఫైనల్లో నలుగురితో పోటీ పడిన సల్మాన్ వీక్షకుల ఆశీర్వాదంతో సీజన్7 విన్నర్ గా అవతరించాడు. సులేమాన్ తల్లిదండ్రులు కూడా మ్యూజిషియన్స్ కావడంతో చిన్ననాటి నుంచే అతనికి ఫ్లూట్ ను నేర్పించినట్లు చెప్పారు. మూడేళ్ల వయసులో సులేమాన్ సాధనను ప్రారంభించాడని, ఆ తర్వాత అతన్ని పీటీ హరిప్రసాద్ చౌరాసియా వద్ద శిక్షణకు పంపుతున్నట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతానని సులేమాన్ చెప్పారు.