అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ శ్రీరాముడి పట్ల తన భక్తిని చాటుకోవడం విశేషంగా నిలిచింది.అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువును రూపొందించింది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువును తయారు చేసింది . కన్నయ్య అయినా రామయ్య అయినా ఒకటేగా అంటోంది భక్తి పారవశ్యంతో.
అద్వితీయమైన భక్తితో దీన్ని తానే తయారు చేశానని పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ పేర్కొంది. ఇంతకు ముందు పిలిభిత్‌లో 16 అడుగుల వేణువు రికార్డు ఉండేది. తాజాగా రామయ్యకోసం ఈ రికార్డును బ్రేక్ చేసింది. కుమారుడు అర్మాన్ నబీ,సమీప బంధువు షంషాద్ సాయంతో అతి పెద్ద వేణువును తయారు చేసింది. జనవరి 22న రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో పిలిభిత్ వేణు నాదం ప్రతిధ్వనించనుంది. అంతేకాదు పర్వీన్ కుటుంబం మూడు తరాలుగా కన్నయ్య వేణువును తయారు చేస్తోంది.
Muslim artisan Hina Parveen has made a 21 feet long Bansuri for Bhagawan Ram in Pilibhit
— Organiser Weekly (@eOrganiser) January 20, 2024
This world's largest playable flute has been sent to Ayodhya Dham#RamMandir #RamMandirPranPratishtha pic.twitter.com/xLlOugj4Y5
ఈ వేణువును స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందట. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామని పర్వీన్ కుటుంబం తెలిపింది. రెండు వైపుల నుంచి వాయించ గలిగే ఈ వేణువు తయారీకి 10 రోజులు పట్టిందని అలాగే తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment