రాంజీ... రాంజీ రాంజీ... రాంజీ... | Lyric Magic | Sakshi
Sakshi News home page

రాంజీ... రాంజీ రాంజీ... రాంజీ...

Published Sun, May 17 2015 12:10 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కాజల్, జూనియర్ ఎన్టీఆర్: ‘బాద్‌షా’ చిత్రంలో ‘బంతిపూల జానకీ జానకీ...’ పాట సన్నివేశం - Sakshi

కాజల్, జూనియర్ ఎన్టీఆర్: ‘బాద్‌షా’ చిత్రంలో ‘బంతిపూల జానకీ జానకీ...’ పాట సన్నివేశం

లిరిక్ మేజిక్
 
‘‘ఈవారం ‘లిరిక్ మేజిక్’ ఏం చేద్దాం’’ అన్నారు క్యాబిన్‌లోకి వెళ్లగానే మా ఫీచర్స్ ఎడిటర్  రామ్.
ఆయనకు కిక్ అంటే ఇష్టం. ఎమోషన్‌లో కూడా కిక్ ఉండాలి. వట్టి ఉద్వేగపు ప్రాణి.
‘‘బంతిపూల జానకీ జానకీ... నీకంత సిగ్గు దేనికీ దేనికీ... బాద్‌షా మూవీలోది సార్’’.
‘‘వొద్దొద్దు’’ అన్నారు రామ్.
‘‘ఎక్కుతుంది సార్’’.
‘‘అందుకే వద్దు. వాటిజ్ దట్. ‘కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో’ ఆ పాటలోనే కదా..’’
‘‘అవున్సార్. థియేటర్ బద్దలైపోయింది. మంచుకొండల్లో కాజల్, జూనియర్ ఎన్టీఆర్ గుంపునేసుకుని పాడతారు’’.
‘‘ఏం చెబుతావు... ఈ పాట గురించి... నా కూతురికి, నా మేనకోడలికి? కొట్టించుకోండి, తిట్టించుకోండి. తాళిబొట్టు కట్టించుకోండి అనా? వేరే పాటల్లేవా రామజోగయ్యశాస్త్రి ఉట్టిలో’’
‘‘రెండు లైన్‌లే కదా సార్’’.
‘‘రెండు లైన్‌లే. పాటంతా అయ్యాక గుర్తుండేదీ ఆ రెండు లైన్‌లే’’.
‘‘పదాల్లో రిథమ్ ఉంది సార్. చేద్దాం’’
‘‘నో’’
‘‘ఏంట్సార్ మీ అబ్జెక్షన్?!
‘‘రిథమ్‌తో లిటరరీ వాల్యూ వస్తుందా మాధవ్? గో టు హెల్ విత్ యువర్ బంతిపూల జానకి’’
‘‘రిథమ్ కూడా లిరిక్కే సార్. అందులోని మేజిక్ గురించి రాద్దాం’’.
‘‘సరే సావు. ఈ పాట విషయంలో జోగయ్యశాస్త్రిని ఆహా ఓహో అంటే మాత్రం నే ఐటమ్ పెట్ట’’.
     
 
 సాకీ :

ఆమె : కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో
రాంజీ రాంజీ రాంజీ రాంజీ... హాయ్ రాంజీ రాంజీ రాంజీ రాంజీ
పల్లవి :
అతడు: బంతిపూల జానకీ జానకీ నీకంత సిగ్గు దేనికీ దేనికీ
చలో చలో నాతో వచ్చెయ్ అత్తారింటికీ
 ॥॥
ఆమె: ఆకువక్క సున్న ముంది నోరు పండటానికి
ఆడ ఈడు ముందరుంది నీకు చెందడానికి
అతడు: ఉట్టిమీద తేనెపట్టు నోటిలోకి జారినట్టు సోకులన్ని పిండుకుంటనే

రెండేళ్లయింది ‘బాద్‌షా’ రిలీజై! ఆ సినిమాలోని ‘‘బంతిపూల జానకి’’... మ్యూజిక్ లవర్‌ల చెవుల్నించి ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడే ఉండిపోయి రిథమిక్‌గా స్టెప్పులు వేస్తూనే ఉంది.
ఫ్లష్ అండ్ బ్లడ్ రామజోగయ్య శాస్త్రి
ప్రాణం పోసింది ఎస్.ఎస్.థమన్.
ప్రాణం తీసింది కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.
అమృతం పోసి అప్‌లిఫ్ట్ చేసింది దలేర్ మెహందీ, రనీనారెడ్డి. (సింగర్స్)
సాకీ, పల్లవి... అల్టిమేట్! జోడు గుర్రాల హార్స్ పవర్.
తర్వాతి రెండు చరణాలు మాటల ప్రవాహం. తేనె ఊటల తీరని దాహం.
సిగ్గుపడకుండా అత్తారింటికి వచ్చేయ్‌మని హీరో హీరోయిన్‌ని ప్రతి చరణానికి ముందూ అడుగుతుంటాడు. ఆమె కూడా నాట్ ఈటెన్ లెస్. తక్కువేం తిన్లేదు.
అసలు పాట మొదలు పెట్టిందే ఆమె. ఎండ్ చేసిందీ ఆమే! చరణాల మొదలూ తుదీ ఆమెవే. ‘కొట్టినా తిట్టినా..’ అని హీరోయిన్ స్టార్ట్చెయ్యగానే, హీరో ఆలోచన్లు డెరైక్టుగా అత్తారింటికి వెళ్లిపోతాయి. పల్లవిలో ఆమె ఆకు వక్క సున్నం అనగానే బాద్‌షా ఊహలు ఉట్టిమీది తేనెపట్టులో చిక్కుకుపోతాయి.
 
మొదటి చరణంలో అతడు చెంప గిల్లితే, ఆమె చేప ముల్లై గుచ్చుతుంది.
రెండో చరణంలో అతడు ఆమెను జల్లెడ పడితే, ఆమె అతడికి కుర్రకళ్ల కుంపటై సెగపెడుతుంది.
పదాలకు దారాలు కట్టి వాటి చివర్లకు హీరోహీరోయిన్లను కట్టి రిథమిక్‌గా ఆడించారు రామజోగయ్య. సంకురాత్రి కోడి అంటాడు, శంకుమార్కు లుంగీ అంటాడు. పాలమీగడ అంటాడు. కంచిపట్టు పావడా అంటాడు. మందారం అంటాడు. బంగారం అంటాడు.
కాజల్ ఒంటినీ, బాద్‌షా కంటినీ రిప్రెజెంట్ చేస్తూ రామజోగయ్య రాసుకుపోయాడు. యూత్ పురాణాన్ని స్మూత్‌గా రక్తి కట్టించాడు. ఇది ఆయనకు కాంప్లిమెంట్ కాకపోవచ్చు. కానీ రిథమ్‌కి ఆయనిచ్చిన లిటరరీ స్టేటస్ ఇది.
నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ (ఖలేజా), దేవదేవం భజే దివ్య ప్రభావం (అత్తారింటికి దారేది), నీ పదముల ప్రభవించిన గంగా యమున (శిరిడిసాయి) లాంటి పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రిని ఈ పాట రాసినందుకు మా ఫీచర్స్ ఎడిటర్  క్షమించేయొచ్చు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement