stays
-
లాంగ్ వీకెండ్.. ఎక్కువ మంది ఇక్కడికే..
స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే.. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్లను ఎయిర్‌బీఎన్‌బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్‌లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. -
2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో హైకోర్టు లేదా దిగువ కోర్టులి2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన స్టేలు 6 నెలల తర్వాత ప్రత్యేకంగా పొడిగింపు ఆదేశాలివ్వకుంటే వాటంతటవే రద్దవుతాయంటూ 2018లో ఇ2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 ప్రకారం సంక్రమించిన అధికారాలను 2018 నాటి తీర్పుతో హైకోర్టులు కోల్పోయాయంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. అప్పటి తీర్పుపై సమీక్షను రాజ్యాంగధర్మాసనానికి అప్పగిస్తామని తెలిపింది. -
‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్సీఎల్ఏటీ భారీ ఊరట
ముంబై: మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై స్టే విధించింది. జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది. గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి ఉన్నామన్నారు. కాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్ వ్యవహారంలో సంజీవ్ కుమార్ జలాన్‌ను, సిటీ నెట్వర్క్స్ విషయంలో మోహిత్ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్ కోరినప్పటికీ ఎన్సీఎల్టీ బెంచ్ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్ప్రైజెస్ ఎండీ పునీత్ గోయెంకా .. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్వర్క్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్ఇండ్ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్సీఏల్ఏటీ తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. -
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో!
..బుక్ రాకుండా మళ్లీ స్టే తెచ్చుకుంటాడేమో! -
గ్రేటర్ పోరు: శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నామినేషన్ తిరస్కరణపై నిన్న గాజుల రామారం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాసేపట్లో ఎస్ఈసీతో కూన శ్రీనివాస్‌గౌడ్ భేటీకానున్నారు. -
హీరోయిన్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే..!
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు గురిచేయ్యవద్దనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు వివరించింది. నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ. 37 లక్షలు తీసుకున్నారని, చివరి నిమిషంలో ఈవెంట్రి ఆమె హాజరుకాలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. ఆమె రాకపోవడంతో తనకు భారీఎత్తున నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుని విచారించిన న్యాయముర్తి ఆమె అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంబానీ బ్రదర్స్ డీల్‌కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. ఆర్‌కాం టవర్ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్ఎస్బీసీ డైసీ ఇన్వెస్ట్మెgట్స్ (మారిషియస్) లిమిటెడ్ సవాల్‌ను కోర్టు స్వీకరించింది. దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం కౌంటర్ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది. ఆస్తుల విక్రయానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది. కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్‌ఎస్)విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
అంబానీకి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఆర్ కాం కి షాకిచ్చింది. మలేషియా కంపెనీ మాక్సిస్ నుంచి 2 జి లైసెన్స్ ను మరో టెలికం కంపెనీ బదిలీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మనీ లాండరింగ్ కేసు కొనసాగుతుండగా నే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ప్రతిపాదిత ఒప్పందంపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు నలుగురూ స్పెషల్ కోర్టుముందు విధిగా హాజరు కావాలంటూ సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాపార వేత్త ఆనంద కృష్ణన్, మలేసియా సంస్థ మాక్సిస్ కు చెందిన అగస్టస్ రాల్ఫ్ మార్షల్, మరో ఇద్దరు జనవరి 27లోపు కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణకు ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. విచారణకు ప్రమోటర్లు అంగీకరించకపోతే 2016లో ఎయిర్ సెల్ కు కేటాయించిన 2 జీ స్పెక్ట్రంను లైసెన్స్ ను సీజ్ చేయాలని తెలిపింది. నిందితులు కోర్టు ముందు హాజరు కాకపోతే 2 వారాల్లోగా దీన్ని విక్రయించాల్సిందిగా టెలికాం శాఖకు స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లైసెన్సు ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ 2 జి లైసెన్స్ బదిలీ ద్వారా చందాదారుల ప్రతికూల ప్రభావాన్ని నివారించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా సంచలనం రేపిన ఎయిర్ సెల్ మాక్సిస్ కుంభకోణంలో 2014 ఆగస్టులో మారన్ సోదరులతో బాటు మలేసియా వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ మీద, మలేసియాకు చెందిన మరో వ్యక్తి అగస్టస్ రాల్ఫ్ మార్షల్ పైన, సన్ డైరెక్ట్, మాక్సిస్ కమ్యూనికేషన్, సౌత్ ఏషియా ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్ వర్క్ మీద సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇటాలియన్ మెరైన్స్పై న్యాయవిచారణ నిలిపివేత
న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ ఇద్దరు భారత మత్స్యకారులను కాల్చిచంపిన కేసు మరో మలుపు తిరిగింది. నిందితులకు సంబంధించిన నేర విచారణ ప్రక్రయలన్నింటినీ భారత అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఇటాలియన్ మెరైన్స్ను శిక్షించే హక్కు భారత్‌కు లేదని, కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సెప్టెంబర్ 24లోగా తనకు సమర్పించాలని యూనైటెడ్ నేషన్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిలిపివేత జనవరి 13 వరేకేనని కోర్టు పేర్కొంది. అసలేం జరిగింది? 2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ షిప్.. సింగపూర్ నుంచి ఈజిప్ట్ బయలుదేరింది. కేరళ తీరంలో తమ నౌకకు సమీపంగా వచ్చిన ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీ నావికులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఆ సమయంలో జాలర్ల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు.. ఇటాలియన్ మెరైన్స్ పై ఐపిసీ 302 కింద కేసు నమోదుచేశారు. భారత ప్రభుత్వం కూడా వారిని లీగల్‌గా ప్రాసిక్యూట్ చెయ్యాలని నిర్ణయించింది. అయితే భారత్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇటలీ నౌకాదళం.. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల విచారణ అనంతరం నిందితులను శిక్షించే అధికారం మన దేశానికి లేదని ఐక్యరాజ్య సమితి కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయవిచారణను నిలిపివేసినట్లు తెలిసింది.