స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్‌లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్‌లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.
వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్‌తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్‌లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్‌లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.
ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే..
ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్‌లను ఎయిర్‌బీఎన్‌బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్‌బీఎన్‌బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్‌లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment