
సాక్షి, హైదరాబాద్: గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నామినేషన్ తిరస్కరణపై నిన్న గాజుల రామారం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాసేపట్లో ఎస్ఈసీతో కూన శ్రీనివాస్‌గౌడ్ భేటీకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment