gajularamaram
-
గాజులరామారం చిత్తారమ్మా జాతర..అశేష భక్తజనం (ఫొటోలు)
-
గాజులరామారంలో అడవి పిల్లి కలకలం
-
వీడియో రికార్డు చేస్తూ అధికారి లైంగిక వేధింపులు..
-
Heavy Rains: గాజుల రామారంలో పెద్దచెరువు నుంచి కాలనీల్లోకి వరద నీరు
-
గాజుల రామారం లో ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)
-
రూ.10కే వెజ్ బిర్యానీ.. మన హైదరాబాద్‌లోనే ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మార్కెట్లో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లలో సైతం కనీస ప్లేట్ ధర రూ.30. మీల్స్ అయితే రూ.70 నుంచి 100కు పైనే. ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్‌లో కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ అందిస్తున్నాడు. గతంలో అంబర్‌పేట్‌లో నడిపే వాడినని తెలిపాడు. అక్కడ తన కుటుంబ సభ్యులకు అప్పగించి దేవేందర్‌నగర్‌లో బిర్యాని సెంటర్ నడుపుతున్నానని పేర్కొన్నాడు. వచ్చే కొద్దిపాటి లాభాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు మహేష్ తెలిపాడు. ప్రతిరోజు 70 నుంచి 100 ప్లేట్ల వరకు అమ్ముతున్నాడు. అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్ బిర్యానీ బోర్డు చూసి ఒక పట్టు పట్టి వెళ్లిపోతున్నారు. -
వృద్ధాప్యంలోనూ.. కుటుంబం కోసం బండలు కొట్టి, చెమట చిందిస్తూ..
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): మనుమలతో ఇంటి వద్ద సరదాగా గడపాల్సిన వయసులో ఆ వృద్ధుడు ఎండనకా.. వాననకా.. కుటుంబం కోసం తన చెమటను చిందిస్తున్నాడు. గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీకి చెందిన 80 సంవత్సరాల జి.పుల్లప్ప వృద్ధాప్యంలోనూ బండలు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ విషయమై ‘సాక్షి’ అతడిని పలకరించగా తనకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారని, రోజంతా కష్టపడి ఇప్పటికి నలుగురు కూతుళ్ల పెళ్లి చేశానని, మరో కూతురు, కొడుకు పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని బదులిచ్చారు. పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా రావడం లేదని, అధికారులు స్పందించి నా వంటి వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరాడు. (చదవండి: చారిత్రక సంపదకు నయా నగిషీలు) -
గాజులరామారం బాలాజీ లేఅవుట్లో ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
గ్రేటర్ పోరు: శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నామినేషన్ తిరస్కరణపై నిన్న గాజుల రామారం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాసేపట్లో ఎస్ఈసీతో కూన శ్రీనివాస్‌గౌడ్ భేటీకానున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్ : గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా చెయ్యి విరిగింది : కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ర్కోటీని పూర్తి కాకుండా తన తమ్ముడిని ఎలా డిస్క్వాలిఫై చేస్తారని ప్రశ్నించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోలీసులు లాఠీచార్జ్‌లో తన చేయి విరిగిందన్నారు. కుట్రపూరితంగా తన తమ్ముడిని నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తనతో పాటు మిగతా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని చెపఆపరు. పోలీసు అధికారులు టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. -
గాజులరామరంలో నీటి గుంతలో పడి ముగ్గురు మృతి
-
కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పది రోజుల క్రితం గాజులరామారం చిత్తారమ్మ జాతరలో ఉదయ్‌తేజ్ అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు డీసీపీ సాయిశేఖర్ ఆదేశాల మేరకు సవాల్‌గా తీసుకున్నారు. పోలీసులు 11 బృందాలతో గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో భయపడ్డ కిడ్నాపర్లు ఉదయ్‌తేజ్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పొలంలో తెల్లవారు జామున వదిలి వెళ్లారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీశారు. జీడిమెట్ల పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు సిద్దిపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. -
గాజులరామారంలో వరుస చోరీలు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. గాజులరామారం శివసాయికాలనీలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. దీనిపై బాధితులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో దొంగలు వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీ శ్రీ చిత్తారమ్మ జాతర సందడి
-
గాజులరామారంలో క'న్నీటి' కథలు
-
గెలుపోటములపై ‘స్వతంత్రుల’ ప్రభావం
గాజులరామారం, న్యూస్‌లైన్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థులే ఇతర అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రభావం చూపబోతున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా పరోక్షంగా విజయావకాశాలను నిర్ణయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పుడు అభ్యర్థులు తమకు ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన బెట్టి తమ ప్రత్యర్థులకు పోల్ అయ్యే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. బరిలో 23 మంది అభ్యర్థులు తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన, ప్రతిపక్షాలతో పాటు ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రులు 9 మంది కూడా బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు ఇతర పార్టీల నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలోని 6లక్షలకు పైగా ఉన్న ఓటర్లలో 2.94 లక్షల మందే ఓట్లు వేశారు. వీరే బరిలో నిలిచిన 23 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు. పోలింగ్ శాతం తగ్గుదల... అభ్యర్థుల అయోమయం 2009 అసెంబ్లీ ఎన్నికలలో 3,13,160 ఓటర్లు ఉండగా, 2014 ఎన్నికల నాటికి అది 6,01,204కి పెరిగిన సంగతి తెలిసిందే. అంటే గత ఎన్నికలకన్నా ఈసారి అదనంగా 50 శాతానికిపైగా ఓటర్లు పెరిగారు. అభ్యర్థులు కూడా ఎన్నికల ముందు వరకు పెరిగిన ఓటర్ల శాతం చూసి తమ గెలుపుపై అంచనాలు వేసుకున్నా రు. కానీ పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. అసలే రెబల్స్... దీనికి తోడు పార్టీలు మారిన ద్వితీయ శ్రేణి నాయకులు... దీంతో ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉండడంతో మైనార్టీల ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. వీటన్నిటికితోడు బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు పోలయ్యే ఓట్లు తమ విజయంపై ఎక్కడ ప్రభావం చూపిస్తాయో అని ఆందోళనకు గురవుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. పోలింగ్ శాతం తగ్గుదల, పోలైన ఓట్లలో చీలిక, ఎక్కువగా స్వతంత్రులు, ఇతరులు పోటీలో ఉండడం తదితర విషయాలు అభ్యర్థుల ఆందోళనకు ప్రధాన కారణం. ఓటర్లతో పాటుగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈసారి గెలుపోటములను నిర్ణయించనున్నారు.