సాక్షి, హైదరాబాద్ : గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా చెయ్యి విరిగింది : కూన శ్రీశైలం గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ర్కోటీని పూర్తి కాకుండా తన తమ్ముడిని ఎలా డిస్‌క్వాలిఫై చేస్తారని ప్రశ్నించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోలీసులు లాఠీచార్జ్‌లో తన చేయి విరిగిందన్నారు. కుట్రపూరితంగా తన తమ్ముడిని నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తనతో పాటు మిగతా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని చెపఆపరు. పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment