సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా గెలుపు, ఓటములు ఉంటాయి. గెలుపులోనూ చాలా చోట్ల ఒకటి, రెండో, మూడో స్థానాలుంటాయి. ఎన్నికల్లో మాత్రం ఒక్కటే గెలుపు. దానికి రెండు, మూడు స్థానాలంటూ ఉండవు. కానీ, రెండో స్థానంలో ఉన్నవారెవరైనా ఇంకొంచెం కష్టపడితే గెలిచే వారం అనుకోవడం సహజం. అలా బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 67 సీట్లలో, బీజేపీ 78 సీట్లలో రెండో స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ఒక్కచోట మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. అది 94 స్థానాల్లో మూడో స్థానానికి దిగజారింది. ఇక టీడీపీ కనీసం రెండో స్థానంలో కూడా లేకుండా పోయింది.
టీఆర్‌ఎస్ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ.
మోండా మార్కెట్, రామ్‌గోపాల్‌పేట, మల్కాజిగిరి, మౌలాలి, వినాయకనగర్, జీడిమెట్ల, మూసాపేట, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, అమీర్‌పేట,జూబ్లీహిల్స్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్, రామ్‌నగర్, ముషీరాబాద్, ఆడిక్‌మెట్, బాగ్‌అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ, హిమాయత్‌నగర్,గన్‌ఫౌండ్రి, అహ్మద్‌నగర్, గుడిమల్కాపూర్, నానల్‌నగర్, టోలిచౌకి, గోల్కొండ, మంగళ్‌హాట్, జియాగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, సులేమాన్‌నగర్, కిషన్‌బాగ్, రామ్నాస్‌పురా, జహనుమా, గోషామహల్, బేగంబజార్, నవాబ్‌సాహెబ్‌కుంట, ఫలక్‌నుమా, బార్కాస్, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్, గౌలిపురా, తలాబ్‌చంచలం,పత్తర్‌గట్టి, రెయిన్‌బజార్, మూసారాంబాగ్, సైదాబాద్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, లింగోజిగూడ,చంపాపేట, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ ఉన్నాయి.
బీజేపీ 2వ స్థానంలో ఉన్న డివిజన్లు ఇవీ..
బేగంపేట, బన్సీలాల్‌పేట, బౌద్ధనగర్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట, గౌతమ్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, వెంకటాపురం, అల్వాల్, మచ్చబొల్లారం, కుత్బుల్లాపూర్, సుభాష్‌నగర్, సూరారం,చింతల్, రంగారెడ్డినగర్, జగద్గిరిగుట్ట,ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, వీవీనగర్, కూకట్‌పల్లి, బాలానగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఫతేనగర్, అల్లాపూర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, పటాన్‌చెరువు, రామచంద్రాపురం, భారతీనగర్, చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, బోరబండ, రహ్మత్‌నగర్, సనత్‌నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, అంబర్‌పేట,గోల్నాక, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, విజయనగర్‌కాలనీ, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, కార్వాన్, దత్తాత్రేయనగర్, దూద్‌బౌలి, పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ, జంగమ్మెట్, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట, రియాసత్‌నగర్, కుర్మగూడ, లలితాబాగ్, మొఘల్‌పురా, డబీర్‌పురా, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్, మీర్‌పేట హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, డాక్టర్ ఏఎస్‌రావునగర్, కాప్రాలున్నాయి. అత్యధికంగా 15 వేల నుంచి 20 వేల ఓట్ల మెజార్టీ పొందిన అభ్యర్థులు 12 మంది ఉన్నారు. వారంతా ఎంఐఎం వాళ్లే కావడం విశేషం.
2వ స్థానం
టీఆర్‌ఎస్ | 67 |
బీజేపీ | 78 |
ఎంఐఎం | 1 |
కాంగ్రెస్ | 1 |
ఇండిపెండెంట్లు | 2 |
టీడీపీ | 0 |
Comments
Please login to add a commentAdd a comment