Kuna SriSailam Goud
-
జేపీ అధిష్టానంపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం అసంతృప్తి
-
‘కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి
కుత్బుల్లాపూర్: ఓ టీవీ చానల్ ఏర్పాటు చేసిన చర్చా వేదిక రసాభాసగా మారింది. కుత్బుల్లా పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యలను లేవనెత్తుతూ ఓ టీవీ చానల్ సూరారం రామ్ లీలా మైదానంలో బుధవారం బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ వేదికలో భూకబ్జాల విషయంపై బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఎమ్మెల్యే వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరగ్గా, ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదే చర్చావేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి కూడా ఉన్నారు. కాగా, ఎమ్మెల్యే వివేకానంద బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి విజయశాంతి, ఇతర కీలక నేతలు బయటకు వచ్చి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి ఓటమి పాఠం: వ్యూహం మార్చిన కవిత -
పోలీసుల లాఠీఛార్జీలో నా చెయ్యి విరిగింది
-
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్
-
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్ : గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా చెయ్యి విరిగింది : కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ర్కోటీని పూర్తి కాకుండా తన తమ్ముడిని ఎలా డిస్క్వాలిఫై చేస్తారని ప్రశ్నించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోలీసులు లాఠీచార్జ్‌లో తన చేయి విరిగిందన్నారు. కుట్రపూరితంగా తన తమ్ముడిని నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తనతో పాటు మిగతా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని చెపఆపరు. పోలీసు అధికారులు టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్ నేతలపై వరుస కేసులు..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, కోదండరెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనపై కూడా కేసు బనాయించారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. ‘నాపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానందా, మరికొంతమంది టీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతో కేసు పెట్టారు. సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలపై వరుస కేసులు..! మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాస్‌పోర్ట్ కేసు, గండ్ర వెంకటరమణపై అక్రమ ఆయుధాల కేసు, కూన శ్రీశైలంగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ హౌసింగ్ కేసు.. ఇలా వరుస కేసులతో కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఉన్న పాత కేసులను తిరగదోడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కై ప్రజాస్వామిక వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ప్రజాస్వామిక పద్ధతిలో అసెంబ్లీ సఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీజీపీని వారు కోరారు. -
పార్టీ రక్షణ బాధ్యత కార్యకర్తలదే: బొత్స
రాష్ట్రం సున్నితమైన అంశంతో సతమతమవుతోందని, ఈ అంశంపై అప్రమత్తతతో ఉంటూ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. నాయకులు సైతం నమ్ముకున్న పార్టీ భవిష్యత్ కోసం పనిచేయాలని సూచించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తన అనుచరులతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ.. సామాన్యుడి అవసరాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. అధికారమే ధ్యేయంగా పూటకో మాట, ప్రాంతానికో మాట చెబుతూ చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను అందరూ చూస్తున్నారని అన్నారు. మరొక పార్టీ దోచుకుంది దాచుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాటకు నిలబడి, దానిని అమలు చేసే పార్టీ కాంగ్రెసేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వొద్దని కిరణ్ చెప్పలేదు: సర్వే సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదేనని సమర్థించారు. విభజనవల్ల తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని కిరణ్‌కుమార్‌రెడ్డి అనడం సబబేనని పేర్కొన్నారు. సీమాంధ్రలో పార్టీని రక్షించుకునే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారని చెప్పారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదని, రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆయన పూర్తిగా సహకరిస్తారన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి. ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కె. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: బొత్స
హైదరాబాద్ : ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్తితుల్లో వెనకడుగు వేయదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకునే రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన అనుచరులతో బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.