
శ్రీశైలం గౌడ్‌పై దాడి చేస్తున్న వివేకానంద
కుత్బుల్లాపూర్: ఓ టీవీ చానల్ ఏర్పాటు చేసిన చర్చా వేదిక రసాభాసగా మారింది. కుత్బుల్లా పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యలను లేవనెత్తుతూ ఓ టీవీ చానల్ సూరారం రామ్ లీలా మైదానంలో బుధవారం బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ వేదికలో భూకబ్జాల విషయంపై బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఎమ్మెల్యే వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరగ్గా, ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదే చర్చావేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి కూడా ఉన్నారు. కాగా, ఎమ్మెల్యే వివేకానంద బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment