
గాజులరామారంలో వరుస చోరీలు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. గాజులరామారం శివసాయికాలనీలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. దీనిపై బాధితులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో దొంగలు వరుస చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.