
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మార్కెట్‌లో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లలో సైతం కనీస ప్లేట్ ధర రూ.30. మీల్స్ అయితే రూ.70 నుంచి 100కు పైనే. ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్‌లో కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ అందిస్తున్నాడు. గతంలో అంబర్‌పేట్‌లో నడిపే వాడినని తెలిపాడు.
అక్కడ తన కుటుంబ సభ్యులకు అప్పగించి దేవేందర్‌నగర్‌లో బిర్యాని సెంటర్ నడుపుతున్నానని పేర్కొన్నాడు. వచ్చే కొద్దిపాటి లాభాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు మహేష్ తెలిపాడు. ప్రతిరోజు 70 నుంచి 100 ప్లేట్ల వరకు అమ్ముతున్నాడు. అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్ బిర్యానీ బోర్డు చూసి ఒక పట్టు పట్టి వెళ్లిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment