ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ | Bhumika re-entry with Mahendar Singh Dhoni | Sakshi
Sakshi News home page

ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ

Published Fri, Nov 20 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ

ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ

తమిళసినిమా:  ప్రముఖ క్రికెటర్ ధోని జీవిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న హిందీ చిత్రం ద్వారా నటి భూమిక రీఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందిన నటి భూమిక. తమిళంలో రోజాకూట్టం చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత సూర్య సరసన చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాలు చేసి ప్రాచుర్యం పొందారు. తెలుగులోనూ సింహాద్రి, మిస్సమ్మ తదితర పలు చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు.
 
  నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్ భరత్‌ఠాగూర్ ప్రేమలో పడి 2007లో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తను నిర్మాతగా చేసి తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం భూమికను తీవ్ర నష్టాలకు గురి చేయడంతో భర్తతో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ మధ్య భరత్‌ఠాగూర్ నుంచి విడిపోయినట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్న భూమిక ఆ వెంటనే దాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు ధోని జీవిత కథా చిత్రంతో రీఎంట్రీ కానున్నారు.
 
 దీని గురించి భూమిక తెలుపుతూ తాను 2007లో గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని మళ్లీ ఇన్నాళ్లకు క్రికెటర్ ధోని జీవిత కథతో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. అయితే చాలా ముఖ్యపాత్ర అని మాత్రం చెప్పగలనని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement