క్యారే.. భారీ ప్లానా? | Pa Ranjith's next film will be in Hindi | Sakshi
Sakshi News home page

క్యారే.. భారీ ప్లానా?

Published Sat, Oct 6 2018 5:37 AM | Last Updated on Sat, Oct 6 2018 5:37 AM

Pa Ranjith's next film will be in Hindi - Sakshi

రజనీకాంత్‌ని రెండు సార్లు డైరెక్ట్‌ చేసి, క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు పా. రంజిత్‌. ‘కాలా’లో రజనీతో ‘క్యా రే సెట్టింగా?’ అనిపించిన రంజిత్‌ ఓ హిందీ చిత్రం తెరకెక్కిస్తారన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇది  పీరియాడికల్‌ మూవీ అని సమాచారం. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఓ యోధుని జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందట. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో బాలీవుడ్, సౌత్‌ ఇండస్ట్రీల్లోని చాలామంది స్టార్స్‌ నటించబోతున్నారట. ఓ ముఖ్య పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ కూడా నటించొచ్చు అనే వార్త బీటౌన్‌లో షికారు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా సిల్క్‌ స్మిత బయోపిక్‌ను టీవీ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు పా. రంజిత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement