కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు! | Rajinikanths Kaala Tamil teaser released | Sakshi
Sakshi News home page

Mar 2 2018 8:31 AM | Updated on Apr 3 2019 9:01 PM

 Rajinikanths Kaala Tamil teaser released - Sakshi

సాక్షి, సినిమా : ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సౌతిండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘కాలా’ టీజర్‌ వచ్చేసింది. తలైవా మరోసారి మాఫియా డాన్‌ పాత్రలో అదరగొట్టారు. ‘కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు’, ‘వీరయ్య బిడ్డని రా.. ఒక్కడినే ఉన్నా.. దిల్‌ ఉంటే గుంపుగా రండి’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.  ధనుష్‌ వండర్‌ బార్‌ ఫిలిమ్స్ నిర్మాణంలో పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 27న విడుదల కానుంది. తమిళ టీజర్‌ ను ముందుగా రిలీజ్ చేసిన చిత్రయూనిట్‌ 10 గంటలకు తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

రజనీ డాన్‌​ లుక్‌ లో కనిపిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. నానా నటిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతమందించారు. టీజర్‌ గురువారమే రిలీజ్‌ కావాల్సి ఉండగా  కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణం నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్‌ ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement