Bhumika Re-entry
-
బ్యాంగ్ బ్యాంగ్
భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్‌బ్యాక్ అంటే.. ఇలా బ్యాంగ్ బ్యాంగ్‌గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్‌ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది. -
ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ
తమిళసినిమా: ప్రముఖ క్రికెటర్ ధోని జీవిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న హిందీ చిత్రం ద్వారా నటి భూమిక రీఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందిన నటి భూమిక. తమిళంలో రోజాకూట్టం చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత సూర్య సరసన చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాలు చేసి ప్రాచుర్యం పొందారు. తెలుగులోనూ సింహాద్రి, మిస్సమ్మ తదితర పలు చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్ భరత్‌ఠాగూర్ ప్రేమలో పడి 2007లో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తను నిర్మాతగా చేసి తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం భూమికను తీవ్ర నష్టాలకు గురి చేయడంతో భర్తతో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ మధ్య భరత్‌ఠాగూర్ నుంచి విడిపోయినట్లు తన ట్విట్టర్లో పేర్కొన్న భూమిక ఆ వెంటనే దాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు ధోని జీవిత కథా చిత్రంతో రీఎంట్రీ కానున్నారు. దీని గురించి భూమిక తెలుపుతూ తాను 2007లో గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని మళ్లీ ఇన్నాళ్లకు క్రికెటర్ ధోని జీవిత కథతో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. అయితే చాలా ముఖ్యపాత్ర అని మాత్రం చెప్పగలనని అన్నారు.