సవతి తల్లిగా..! | Sridevi to play stepmom in her next Hindi film, Boney confirms | Sakshi
Sakshi News home page

సవతి తల్లిగా..!

Published Mon, Jul 28 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

సవతి తల్లిగా..!

సవతి తల్లిగా..!

ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రం ద్వారా వెండితెరపై మెరిసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత హిందీలో వేరే ఏ సినిమా అంగీకరించలేదామె. తమిళంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కీలక పాత్ర చేయడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు. ఈ సినిమా అంగీకరించిన కొన్ని రోజులకే హిందీలో ఆమె ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
 
 ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ స్వయంగా చెప్పారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. కథ బాగా నచ్చడంవల్ల తానే నిర్మించాలనుకున్నానని బోనీ తెలిపారు. ఈ చిత్రంలో పద్ధెనిమిదేళ్ల కూతురికి శ్రీదేవి సవతి తల్లిగా నటించనుంది’’ అని బోనీ పేర్కొన్నారు. ఇందులో శ్రీదేవి కూతురిగా కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత మళ్లీ ఆ స్థాయికథ దొరికితేనే శ్రీదేవి నటించాలనుకుందని, ఈ చిత్రకథ ఆమెకు పూర్తి సంతృప్తినిచ్చిందని బోనీ కపూర్ తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement