ఓటీటీలో అమ‌లాపాల్ 'లెవల్‌ క్రాస్‌' థ్రిల్ల‌ర్ సినిమా | Amala Paul Level Cross Movie OTT Streaming Date | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అమ‌లాపాల్ 'లెవల్‌ క్రాస్‌' థ్రిల్ల‌ర్ సినిమా

Published Sun, Oct 6 2024 2:33 PM | Last Updated on Sun, Oct 6 2024 3:56 PM

Amala Paul Level Cross Movie OTT Streaming Date

అమ‌లాపాల్ తాజాగా నటించిన  మ‌ల‌యాళ సినిమా 'లెవల్‌ క్రాస్‌'. ఈ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా న‌టించగా.. ష‌రాఫుద్దీన్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. జులై 26న విడుదలైన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అర్భాఫ్ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకుంది.

'లెవెల్ క్రాస్' చిత్రానికి మ‌ల‌యాళ టాప్‌ డైరెక్టర్‌ జీతూ జోసెఫ్  ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, 12th మ్యాన్‌, నెరు, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. అయితే,  జీతూ జోసెఫ్ శిష్యుడిగా దృశ్యంతో పాటు ప‌లు సినిమాల‌కు అర్ఫాజ్ అయూబ్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు లెవెల్ క్రాస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా  ఎంట్రీ ఇచ్చాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.


 
ఓటీటీలో ఎప్పుడు..?

సుమారు రూ. 10 కోట్లకు పైగానే లెవల్‌ క్రాస్‌ సినిమా కోసం ఖర్చు చేశారు. IMDb రేటింగ్‌ 7.2తో ఒక వర్గం ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆహా ఓటీటీ సంస్థ సోషల్‌ మీడియా ద్వార ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్‌ తేదీని వెళ్లడించలేదు. కానీ, అక్టోబర్‌ 11న దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement