కేజీఎఫ్‌లో... | Sanjay Dutt in KGF Chapter 2 | Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌లో...

Published Sun, Feb 10 2019 12:29 AM | Last Updated on Sun, Feb 10 2019 12:29 AM

Sanjay Dutt in KGF Chapter 2 - Sakshi

అక్షయ్‌ కుమార్, అమితాబ్‌ బచ్చన్, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి స్టార్స్‌ ఆల్రెడీ సౌత్‌ సినిమాలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో సంజయ్‌ దత్‌ పేరు కూడా చేరనుందని తెలుస్తోంది. యశ్‌ హీరోగా నటించిన కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1’. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’లో సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారట. ‘‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 1’లోనే సంజయ్‌ దత్‌గారికి ఓ రోల్‌ ఆఫర్‌ చేశాం. కానీ ఆయన డేట్స్‌ కుదర్లేదు. ఇప్పుడు చాప్టర్‌ 2 కోసం అడగడం జరిగింది’’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరి... సంజయ్‌ దత్‌ ఈ చిత్రానికి సరే అంటారా? వెయిట్‌ అండ్‌ సీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement