reunion
-
అ‘పూర్వ’ విద్యార్థులే!.. 50ఏళ్ల తర్వాత మళ్లీ యూనిఫాం, టై ధరించి స్కూల్‌కు..
సాక్షి, హైదరాబాద్: అది అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్... రెండో అంతస్తులో ఉన్న పదో తరగతి క్లాస్ రూమ్..ఆ రూమ్‌లో ఫుల్ యూనిఫామ్‌లో కూర్చున్న వారికి మాజీ తెలుగు పండిట్ నర్సింహులు క్లాస్ తీసుకుంటున్నారు... ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? యూనిఫామ్స్ వేసుకుని విద్యార్థుల టేబుల్స్‌పై కూర్చున్న వారిలో మాజీ డీజీపీ కోడె దుర్గా ప్రసాద్, సీఎం ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్, కావ్య హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు ఉండటమే. తరగతి గదిలో ఆనంద హేల ఈ స్కూల్లో 1972లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ రీ–యూనియన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థులు స్కూల్ యూనిఫామ్, టై తదితరాలు ప్రత్యేకంగా కుట్టించుకుని, ధరించి రావడంతో పాటు అప్పట్లో వీళ్లు కూర్చున తరగతి గదిలోనే గడిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, కెనడా, న్యూజిలాండ్ నుంచి పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా వచ్చారు. వీరంతా ఆ పాఠశాల ప్రస్తుత విద్యార్థులతోనూ భేటీ అయ్యారు. 1972లో దిగిన గ్రూఫ్ ఫొటో జీవితంలో తాము సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి, ఈ పాఠశాలలో నేర్చుకున్న విద్య ప్రాముఖ్యత తదితరాలను వారికి వివరించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గుర్నాథ్రెడ్డి కూడా తమలో భాగమే అయినప్పటికీ శుక్రవారం నాటి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని కోడె దుర్గాప్రసాద్ తెలిపారు. ఆముద్యాల సుధాకర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించి అందరిని ఏకతాటిపైకి తెచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు, ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ రేవ్బ్రదర్ షజాన్ ఆంటోని అభినందనలు తెలిపారు. -
ఆ స్నేహానికి 80 ఏళ్లు.. వాళ్లకింకా వయసైపోలేదు
వైరల్: వయసు ఒంటికే.. మనస్సుకు ఎంతమాత్రం కాదు. ఇక్కడ అదే నిరూపించారు ఇద్దరు బామ్మలు. వాళ్లిద్దరి స్నేహానికి ఎనభై ఏళ్లు పూర్తయ్యాయి. కలుసుకుని చాలా ఏండ్లే అవుతోందట. తన బాల్య స్నేహితురాలిని ఎలాగైనా కలవాలని ఉందని తన మనవడితో చెప్పుకుంది ఆమె. వీడియో కాల్స్ జమానాలో ఆ మనవడు తల్చుకుంటే ఆమె కోరిక క్షణాల్లోనే తీరిపోయేది. కానీ, అతను అలా చేయలేదు. దగ్గరుండి ఆమెను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఒంట్లో ఓపిక లేకున్నా తన స్నేహితురాలిని చూసే సరికి అవతల ఉన్న బామ్మ ఓపిక తెచ్చుకుంది. లేచి కూర్చుని ఆశ్చర్యపోయింది. ఆప్యాయంగా ముచ్చట్లతో మొదలైన వాళ్ల సంభాషణ.. జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ.. పాత రోజుల్లోకి వెళ్లింది. ఇద్దరూ హుషారుగా జోకులేసుకున్నారు. అలా చాలాసేపు గడిచాక.. వెళ్లే ముందు తన స్నేహితురాలి కాలిని ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది. ముకిల్ మీనన్ అనే యువకుడు తన బామ్మ కోసం ఇదంతా చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వాళ్లిద్దరి రీయూనియన్ పోస్ట్ అమితంగా ఆకట్టుకుంటోంది. బాల్యం అద్భుతమైంది. అందులోని స్నేహాలు ఎంతో మధురమైనవి. ఏళ్లు గడిచిన.. ఆ జ్ఞాపకాలు, అప్పటి చిలిపి చేష్టలు ఎప్పుడూ పదిలంగా ఉండిపోతాయి. View this post on Instagram A post shared by m u k i l m e n o n (@mukilmenon) -
ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్
80వ దశకంలో కెరీర్ స్టార్ట్ చేసి తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కలిశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ రీయూనియన్ వేడుకకి బాలీవుడ్ నటుడు జాపీ ష్రాఫ్ ఆదిథ్యం ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, భానుచందర్, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఆడుతూ..డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సీనియర్ నటులు ప్రతి ఏటా రీయూనియన్ వేడుక నిర్వహిస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో హీరో ఈ వేడుకలను ఆతిథ్యం ఇస్తుంటారు. 2020లో జరిగిన రీయూనియన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘రంగమ్మ..మంగమ్మ’ పాటకు అక్షయ్‌తో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్) -
9 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు బాలిక
ముంబై: తొమ్మిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన మైనర్ బాలిక ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెను అపహరించిన జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీలో తల్లిదండ్రులతో కలిసి జీవించే ఏడేళ్ల పూజ 2013 జనవరి 22న స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యింది. సంతానం లేని జోసెఫ్ డిసౌజా ఆమెను అపహరించాడు. పూజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూజ ఫొటోలతో పోస్టర్లు రూపొందించి, నగరంలో అన్ని చోట్లా అతికించారు. అప్పట్లో మీడియాలోనూ ఈ కేసు సంచలనాత్మకంగా మారింది. పూజ ఆచూకీ పోలీసులకు దొరకలేదు. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్ డిసౌజా–సోనీ దంపతులకు కుమార్తె జన్మించింది. దీంతో పూజను పని మనిషిగా మార్చేశారు. నిత్యం చిత్రహింసలు పెట్టేవారు. నువ్వు మాకు జన్మించలేదంటూ నిజం చెప్పేశారు. పూజ తన గోడును స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద వెళ్లబోసుకుంది. సదరు మహిళ పూజకు సంబంధించిన వార్తలు, వివరాల కోసం ఇంటర్నెట్లో శోధించింది. తొమ్మిదేళ్ల క్రితం అపహరణకు గురికాగా, కేసు నమోదైనట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం చేరవేసింది. పూజను పోలీసులు ఇటీవలే సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం -
నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ
Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి కామెంట్ చేసిన ఒక యూజర్‌కు 'నువ్ యాక్ట్ చేస్తావా' అని ఆ ఆర్ఆర్ఆర్ ట్విటర్ గ్రూప్ అడ్మిన్ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్ నిర్వహించింది. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్. మీక్కీ మౌస్ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే #వాట్సన్సిస్టర్స్ఫరెవర్ అని హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసింది. View this post on Instagram A post shared by Emma Watson (@emmawatson) ఇదీ చదవండి: స్పానిష్ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్ -
యో చూస్కో బడలా.. ఆమెకు బదులు మరో హీరోయిన్.. నెటిజన్ల ట్రోలింగ్
Emma Watson Or Emma Roberts Trolled In Harry Potter Reunion Special: హాలీవుడ్ నుంచి వచ్చిన హ్యారీ పోటర్ చిత్రం అంటే తెలియని వారుండరు. సినిమాలోని వింతలు, అద్భుతాలు పిల్లల నుంచి పెద్దవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2011లో ఈ సిరీస్‌లోని ఎనిమిదో చిత్రం 'హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2'తో ఈ ఫ్రాంచైజీ ముగిసింది. నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20 వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) నిర్వహించింది హెచ్‌బీవో మ్యాక్స్. దీనికి 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' స్పెషల్ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేశారు. హెచ్‌బీవో మ్యాక్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్లో డేనియల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, తదితర సహ నటులు మెమరీ లేన్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. అయితే ఇందులో నిర్వాహకులు ఒక పెద్ద తప్పు చేశారు. ఎమ్మా వాట్సన్ తన అనుభవాలను చెబుతున్న సెగ్మెంట్లో ఆమెకు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్న నాటి ఫొటోను చూపించారు. ఇందులో రాబర్ట్స్ మాంటేజ్ మిన్నీ మౌస్ చెవులను ధరించి ఉంటుంది. ఆ పిక్ 2012లో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఎమ్మా రాబర్ట్స్. ఇది చూసిన ఎమ్మా అభిమానులు రీయూనియన్ నిర్వాహకులపై 'యో.. చూస్కో బడలే, అది ఇది కాదు' అన్నట్లుగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా 'దయచేసి నాకు సహాయం చేయండి. తను కచ్చితంగా ఎమ్మా వాట్సన్ కాదు.. ఎమ్మా రాబర్ట్స్ అని చెప్పండి' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి మరికొన్ని పోస్టులను చూసేయండి. View this post on Instagram A post shared by Emma Roberts (@emmaroberts) GUYS HELP ME THATS LITERALLY EMMA ROBERTS NOT EMMA WATSON ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️ #ReturnToHogwarts #HarryPotter20thAnniversary pic.twitter.com/bLbXcCUpnh — 𝕞𝕒𝕟𝕚𝕒 (@vee_delmonico99) January 1, 2022 Harry Potter 20th Anniversary how do u mess up putting an Emma Roberts child photo instead of an Emma Watson one? You think with such an icon series there would 2X & 3X check things for the reunion.😋 An American actress when we know American kids weren’t used. #ReturnToHogwarts — Krista (@BeatGrrl18) January 2, 2022 I tried to search "emma watson baby" on google and yes that emma roberts baby picture shows up at the top 😂#EmmaWatson #ReturnToHogwarts pic.twitter.com/rkGkqbDPYi — loony (@girlonquibbler) January 2, 2022 Wow. The editors / producers of #HarryPotter #ReturnToHogwarts seriously used a picture of a young Emma Roberts instead of Emma Watson. HOW did this get past everyone?!?! 😂😂😂 pic.twitter.com/kNm0ZkWOh5 — Tyler (@OldGoldenSnitch) January 2, 2022 -
బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..ఫోటో వైరల్
Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral: బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్లో ఎక్కువ ట్రోలింగ్ బారిన పడ్డ వారిలో వీరు ముందుంటారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇద్దరూ ఫ్రెండిష్ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించడంతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టైటిల్ రేసులో ఉన్న షణ్నూ రన్నరప్‌గా సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన సిరి-షణ్నూ తొలిసారిగా కలుసుకోవడం ఇప్పడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్‌ఫ్రెండ్ జెస్సీతో కలిసి వైజాగ్ రోడ్లపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెగిటివిటితో బయటకు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత కూడా ఫ్రెండిప్ కంటిన్యూ చేయడం నెటిజన్లు మనసు గెలుచుకుంటుంది. -
Viral Video: బిగ్‌బాస్ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..
-
పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ
సాక్షి,నెన్నెల(ఆదిలాబాద్): అక్కాతమ్ముడు..అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. అనుబంధమే పదేళ్ల తర్వాత అక్కాతమ్ముడిని మళ్లీ కలిపింది. కుటుంబానికి దగ్గర చేసింది. చనిపోయిందేమో.. అనుకున్న మహిళ శనివారం తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, మధునక్క దంపతులకు కుమారులు శ్రీనివాస్, పవన్, కూతురు రజిత ఉన్నారు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండేవారు. ఈ ప్రాంతం నుంచి కూలీలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. అలా పనుల కోసం పదేళ్ల క్రితం వెళ్లిన రజిత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జమ్మికుంటలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హనీగావుకు చెందిన రాజు అనే యువకుడు రజితకు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్క డే రాజును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తల్లి దండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంతకాలం నెన్నెలకు రాలేదు. రజిత ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా చనిపోయిందేమోనని భావించారు. రెండేళ్ల క్రితం ఆమె అన్న శ్రీనివాస్ చనిపోయినా సమాచారం తెలియకపోవడంతో రాలేదు. ఇటీవల రాఖీ పండుగకు రజిత భర్త రాజుకు రాఖీ కట్టేందుకు అతడి చెల్లెళ్లు రావడం, రాఖీ కట్టడం తన తమ్ముడిని, కుటుంబాన్ని గుర్తు చేసింది. ‘‘మా ఆయనకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెళ్లను చూసి నాకు నా తమ్ముడు పవన్ గుర్తుకు వచ్చాడు. వాడికి రాఖీ కడతానని మూడు రోజుల క్రితం నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం నెన్నెలకు వచ్చాను.. నాకు ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పదేళ్ల తర్వాత మా అమ్మానాన్నలు, నా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది..’’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. మహారాష్ట్రలో జీవనంతో ఆమె కట్టు, బొట్టు మారింది. మరాఠీ, హిందీ భాషా మాట్లాడుతోంది. ఆమెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. శనివారం తమ్ముడు పవన్‌కు రాఖీ కట్టింది. అన్నను గుర్తు చేసుకుంటూ విలపించింది. చదవండి: సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా? -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
బిగ్‌బాస్: కంటెస్టెంట్ల రీఎంట్రీ?
కోవిడ్ కాలంలో బిగ్‌బాస్ షో ఉంటుందా? ఉండదా? అన్న తరుణంలో కింగ్ నాగార్జున నాల్గో సీజన్‌ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లను తీసుకువచ్చినా వారితోనే షోను రక్తికట్టించి విజయవంతంగా నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడిక సీజన్‌కు శుభం కార్డు వేసే సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఓట్లు వేస్తూ కంటెస్టెంట్ల మీద అభిమానం కురిపించిన ప్రేక్షకుల చేతిలోనే వారి గెలుపు ఆధారితమై ఉంది. ఇదిలా వుంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికోసం పెద్ద పెద్ద స్టార్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్లతో స్టెప్పులేయించనున్నారు. అలాగే మాజీ కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులతో హోరెత్తించనున్నారు. (చదవండి: అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) ఎలిమినేట్ అయినవారి రీ ఎంట్రీ! అయితే ఈ సంబరాలన్నీ జరగడానికి ముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంతా హౌస్‌లోకి వెళ్లి పార్టీ చేసుకుంటారు కదా! ప్రతి సీజన్లో పార్టీ పక్కాగా ఉంటోంది కానీ, ఈసారి మాత్రం పార్టీ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయిన వారు ఎవరిపనుల్లో వారు పడిపోయారు. వారిని మళ్లీ క్వారంటైన్లో ఉంచి లోపలకు పంపించేంత సమయం లేదు. దీంతో రీయూనియన్ ఉంటుందా? ఉండదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియన్ 17, 18వ తేదీల్లో ఉండబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) చివరిసారి అందరూ కలుస్తారా? ఒకవేళ అదే నిజమైతే ఇదివరకు కంటెస్టెంట్ల ఫ్యామిలీలను ఓ గాజు తెరలో ఉంచి మాట్లాడించినట్లుగా ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అవకాశముంది. లేదంటే గత సీజన్ల కంటెస్టెంట్లు శ్రీముఖి, హరితేజ, గీతామాధురి, అలీ రెజాలతో ఇంట్లో వారికి ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశాన్ని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతైనా పార్టీ టచ్ ఉండాలంటే అందరూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అని బిగ్‌బాస్ నిశ్చయించుకుంటే మాత్రం ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి లోపలకు వెళ్లేందుకు పచ్చజెండా ఊపేస్తారు. దీనివల్ల ఫైనలిస్టులతో పాటు కంటెస్టెంట్లు అందరూ చివరిసారిగా బిగ్‌బాస్ హౌస్‌లో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే అవకాశం దొరకుతుంది. (చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ) -
‘అంత డబ్బుని గతంలో ఎప్పుడూ చూడలేదు’
హఠాత్తుగా కుండపోత వర్షం మొదలైంది. ఈ వేళ కాని వేళలో వర్షం రాజాకు ఇబ్బందిగా ఉంది. అతడు బయటికి బయల్దేరాడు. కాని ఈ వాన వల్ల ఇల్లు కదల్లేకపోతున్నాడు. ఇది మామూలు వాన కాదు. జలప్రళయంలా వున్నది. రాజా గొణుక్కుంటూ, తిట్టుకుంటూ తన ఇంటి ద్వారానికి అతుక్కుపోయాడు. కొద్దిసేపు ఆగి ఇంకా వెనక్కి పోయాడు. రాజా ఒక కవి, జేబుదొంగ. మరో మాటలో చెప్పాలంటే రెండూనూ. ఇది కొంచెం అసాధారణమైనదే కానీ బెంగాలీలలో అసాధ్యమైంది కాదు. కవిత్వాన్ని బాగా చదువుతాడు. జేబుదొంగ మాత్రమే కాదు తాగుబోతు. తాగడం కోసమే జేబుల్ని కొట్టేవాడో లేక జేబుల్ని కొట్టిన డబ్బు ఖర్చు పెట్టడానికే తాగుతాడో స్పష్టంగా తెలీదు. ప్రతి వ్యక్తికి ఒక గతం ఉంటుంది. అది అద్భుతమైన గతమయితే చరిత్రగా మారుతుంది. అలా పరిగణిస్తే రాజా గతమేమీ గొప్పది కాదు. మంచి కుటుంబంలోనే పుట్టాడు. బియ్యే చదువుతూ పూర్తి కాకుండానే మానేశాడు. ఎందుకంటే చదువు వల్ల ప్రయోజనం లేదని అతనికొక రోజు అనిపించింది. కేవలం డబ్బు సంపాదించడంలోనే సర్వమూ వున్నదని గ్రహించాడు. అంచేత కాలేజీ నుంచి బయటికి వచ్చేశాడు. తల్లిదండ్రులు అప్పటికే గతించారు. కాబట్టి కుటుంబ బాధ్యతలు లేవు. ఒక ఇల్లు ఉండేది. దాన్ని అమ్మివేసి ఆ డబ్బుని జేబులో వేసుకొని విశాలమైన ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు. ఇప్పుడు కలకత్తా మహానగరమే అతడి ప్రపంచంగా వున్నది. కవిగా జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. అయితే జీవితం సారా గ్లాసుల్లోనూ, సాని కొంపల్లోనూ వున్నదని దృఢంగా నమ్మాడు. అనతి కాలంలోనే తనలాంటి భావాలు గల సహచరుల్నీ పోగు చేసుకున్నాడు. క్రమేణా ఒకనాటి విదేశి మద్యం స్థానంలో నాటుసారా చోటు చేసుకున్నది. అతి సామాన్యంగా బ్రతకడం కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత ఒకనాటి రాజా, కాలేజీ రోజుల రాజా, చరిత్రలో కలిసిపోయాడు. ఇదంతా జరిగి సుమారు అయిదు సంవత్సరాలైంది. ఒకే ఆకాశంలో సూర్యుడూ, చంద్రుడూ తిరగడానికి పోటీ పడుతున్నట్టు ఒకే దేహంలో ఇద్దరు రాజాల పోరు చాలా కాలం క్రితమే పరిష్కారమైపోయింది. ఇక మిగిలినదంతా ఒక్కటే. కవిత్వం పట్ల ప్రేమ. తాగినా, చదివినా, మాట్లాడిన ఆడెన్, ఇలియట్ మొదలైన వారి ప్రస్తావనలు వస్తూనే వుంటాయి. ఉయయాన్నే ఈ వర్షపాతం అతని మూడ్‌ని పాడు చేసింది. ఇప్పటికే ఎనిమిదిన్నరయింది. ఒక ట్రామ్ని అందుకోవాలంటే మెయిన్ రోడ్డుకు వెళ్ళాలి. ఆఫీసుకు పోయే జనాల రద్దీ పది తరువాతనే తగ్గుతుంది. తను బయల్దేరుతున్న పని వర్షపునీటిలో వెళ్ళాల్సింది కాదు. అది సాధ్యం కాదు. పాడువర్షం...తనలో తనే తిట్టుకున్నాడు. ఇంకా వర్షం కురుస్తున్నది. తగ్గే సూచనలూ లేవు. రాజా గదిలో చాప మీద మేను వాల్చాడు. సగం చేరబడి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి సందడి సుమారు ఒంటిగంటకు ముగిసింది. ఇప్పుడు శరీరం దూది పింజలా వున్నది. ఆవులిస్తూ విసుగెత్తించే వర్షపు శబ్దాలను వింటున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చేతి వాచీ చూసుకున్నాడు. పది గంటల కొద్ది నిమిషాలయింది. అతడి మూడ్ చెడిపోయి పరిసరాలలో ప్రతిదానిపైనా అసహ్యం పుట్టింది. వర్షం ఆగింది. వీధుల్లో నీరు తగ్గింది. నెమ్మదిగా జనం బయటికి వస్తున్నారు. ఎటు చూసినా బురద చీదరగా వున్నది. రాజా లేచి ముఖం మీద నీళ్ళు చల్లుకొని తల దువ్వుకున్నాడు. తలుపు వద్ద ఏదో ధ్వని వినబడింది. తలుపు తెరిచాడు. ఒక సేవకుడు ఒక ఉత్తరాన్ని తెచ్చి అతడి చేతిలో వుంచాడు. ఉత్తరం! రాజాకు ఉత్తరం! ఇది చాలా అసాధారణమైన సంగతి. ఇక బయటికి వెళ్ళాలనిపించడం లేదు. తిరిగి తన గదిలోనికి వెళ్ళాడు. ఉత్తరాన్ని చూస్తూ కొంచెం బెదిరాడు. ఉత్తరం రావడం అనేది ప్రతిరోజూ జరిగే విషయం కాదు. అందులోనూ తనకి! రాజాకి! మరి ఎవరు రాసి వుంటారు? కవరు చించాడు. అదొక ఆహ్వానపత్రిక. నీలిరంగు కాగితం మీద బంగారురంగు అక్షరాలున్నాయి. ఒకనాటి తన మిత్రుల సమూహం ‘జ్వాలావలయం’ యొక్క వార్షిక సమావేశం. రేపే! ఆహ్వాన పత్రిక వెనుక చిన్న చేతి రాత ఉన్నది: ‘ఈ పుస్తకం నీకు అందుతుందో తెలీదు. అందితే మాత్రం తప్పకుండా రాగలవు. నీ కోసం ఎదురుచూస్తుంటాను–సునీల్’ ‘జ్వాలావలయం!’ కాలేజీలో రాజా తన ఎనమండుగురు మిత్రులతో కలిసి సంఘం ఏర్పాటు చేశాడు. పేరు కూడా అతడే నిర్ణయించాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆశయాలు ఆ పేరుతో ముడిపడి వున్నాయి. ఆ సంఘానికి పేరు రాజా పెట్టాడు. అందరూ సునీల్ ఇంటిలో సమావేశమౌతారు. అదొక పండుగలా వుంటుంది. అక్కడికి మంచి గాయకులు, కవులు, రచయితలను కలకత్తా అంతటి నుండీ ఆహ్వానిస్తారు. చర్చలూ, విశ్లేషణలూ, విమర్శలూ, వాదోపవాదాలు కొనసాగుతాయి. చందాలు పోగు చేస్తారు. వినోద కార్యక్రమాలుంటాయి. రాత్రి నిచ్చెనలు పట్టుకొని గోడకు పోస్టర్లు అంటిస్తారు. అదొక తపస్సు. అదొక యజ్ఞం. ‘జ్వాలా వలయం’ ఈ పేరు గుర్తొస్తే అతడికి కళాశాల జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పటికి ఆ చిన్న జీవితాల్లో అవి ఉజ్వలమైన రోజులు. యౌవనంలో అడుగు పెడుతున్న రోజులు! క్రికెట్ మైదానం, వక్తృత్వపోటీలు, వ్యాసరచన పోటీలు, సాహితీ చర్చలు, ఒకటేమి? గౌరీ, స్నిగ్ధా, మాయా...ఇంకో ఆమె పేరు గుర్తు రావడం లేదు. రోల్‌నెం 67. అతడి గదిలో అమ్మాయిలందరూ వరుసగా గుర్తొస్తున్నారు. ఇక అబ్బాయిలు: బుద్ధా, సునీల్, ఆనంద్, బిమల్! వీళ్ళందరూ అతడి మనోఫలకంపై చిరంజీవులు! వారికి వార్ధక్యం రాదు. మరణం లేదు. ఎప్పుడూ నిత్యయౌవనంతోనే విలసిల్లుతుంటారు. ‘జ్వాలావలయం’ చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడు తన సప్తాశ్వ రథాన్ని అధిరోహించి దిగంతాల వైపు పయనిస్తునట్టుగా వుంటాడు. అప్పుడెప్పుడో నిస్సారమై స్తబ్దమైపోయిన జ్ఞాపకాలనీ అతన్లో తిరిగి ఊపిరి పోసుకొంటున్నాయి. మరి తన చిరునామా ఎలా దొరికింది? నిజానికి తాను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. క్రింది సంతకం మరోసారి చూశాడు. సునీల్! అంటే సునీల్ ఇంకా ఆ సమ్మేళనానికి సంపాదకుడిగా వున్నాడు. అంటే ఎవరూ దాన్ని విడిచి వెళ్ళలేదు. చిరునామా ఎలా సంపాదించాలో తెలీదు. తనని ఆహ్వానించారు...అదేచాలు! రాజా వెళ్తాడు. తప్పకుండా వెళ్తాడు. సునీల్ పిలుస్తున్నాడు. బుద్ధా పిలుస్తున్నాడు. ఆనంద పిలుస్తున్నాడు. విద్యార్థిదశలోని మిత్రులంతా పిలుస్తున్నారు. రాజా విస్మృతగతం, అప్పటి ప్రేమాభిమానాలు, గిల్లికజ్జాలు, నవ్వులూ, కన్నీళ్ళూ...ఇవన్నీ అతడ్ని ఊరించి మరీ పిలుస్తున్నాయి. తప్పనిసరిగా వెళ్తాడు. అవును వెళ్తాడు. రాజా తనను తాను అద్దంలో చూసుకున్నాడు. గత అయిదు సంవత్సరాల్లో కళ్ళు లోతుకు పోయాయి. కళ్ళ చుట్టూ నల్లని చారలు కూడా ఏర్పడ్డాయి. పెదాల మీద తెలుపూ నలుపూ కలిసిన మచ్చలు ఏర్పడ్డాయి. నవ్వితే ఆ పెదాల మధ్య నుండి గారపట్టిన పళ్ళు వికృతంగా కనబడుతున్నాయి. సంవత్సరాల తరబడి అతడి పొడవైన జుత్తుకు నూనె జాడ తెలీదు. ఈ రూపంలో, ఈ స్థితిలో ఇప్పుడు పాత మిత్రుల్ని కలుసుకోవడం సముచితమైన పనేనా? కాదా? అనే మీమాంసలో పడ్డాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒకప్పటిలాగే వుండే అవకాశం లేదు. జీవితపు ఒడిదొడుకులు వార్ని కూడా ఎంతో కొంత మార్చే వుంటాయి. ఆనాటి వారి అమాయకత్వం కూడా బ్రతుకు చక్రాల క్రింద మాయమైపోయి వుంటుంది. ఇంత వరకూ అతడి మనోఫలకం పైన అందరి చిత్రాలు సజీవంగా నిత్యనూతకంగా ఉన్నాయి. వాట్ని అపురూపుంగా పదిలపరుచుకున్నాడు. మధ్యాహ్నమైంది. నిరాశలో మునిగి మద్యం సీసాని తెరిచాడు. బహుశా ఇటువంటి అస్థిమిత స్థితికి అంతకన్నా మంచి మందులేదు. అతడి గుండెలో ఒక చిత్రమైన స్పందన కలిగింది. రకరకాల ఆలోచనలతో తల తిరుగుతున్నది. అతడి గొంతులో ఏదో ధ్వని మేల్కొని పైకి లేచింది. జీవితాన్ని దూదిపింజె కన్నా తేలిగ్గా తీసుకున్న రాజా తాగిన మత్తులో ఏడుస్తున్నాడు. కారణం తేలీదు. అంతలోనే అతడు మనస్సు మార్చుకున్నాడు. మరుసటిరోజు ఉదయాన్నే రైలు బయల్దేరుతుంది. సాయంత్రానికి చేరుతుంది. ఆ రైలుకే బయల్దేరి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది గంటల ప్రయాణం అంతే. అనుకున్న ప్రకారం ఆ శివారు రైల్వేస్టేషన్లో దిగాడు. సాయంకాలమైంది. ఆకాశంలో అక్కడక్కడా మబ్బులు వున్నాయి. చిన్న చినుకులు పడుతున్నాయి. స్టేషన్ మెట్ల వద్దకు వచ్చేసరికి గత జీవితపు స్మృతులు రాజాని స్వాగతించాయి. ఆ గాలిలో చిరపరిచితమైన పరిమళం వుంది. అతడి గుండెలోతుల్లో ఒక అనునాదం మార్మోగింది. ఇటువంటి అనుభూతిని పొంది ఎంతో కాలమైంది. ఆశ్చర్యకరంగా ఇక్కడి బురద కూడా చిరాకు కలిగించడం లేదు. రాజా సంతృప్తిగా నడుస్తున్నాడు. ప్రయాణంలో చాలాసేపు ట్రైను కిటికి వద్దనే ప్రకృతిని చూస్తూ గడిపాడు. మొదట చిన్న కునుకు ముంచుకొచ్చింది. అంతలోనే ఒక కల వచ్చి మేల్కొలిపింది. అతడి పాతజీవితం కళ్ళ ముందు కదలాడింది. కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నట్లనిపించింది. తల్లి భోజనం వడ్డించి పిలుస్తున్నది. ‘‘రా....రా...నాయనా అన్నం పెట్టాను. ఇంకెంతసేపు ఎదురుచూడను?’’ ‘‘ఎందుకే అలా అరుస్తావు! చేపల కూరా...త్వరగా తీసుకురా మరి...’’ అన్నాన్ని చల్చార్చడానికి చేతిలో ఒక విసనకర్ర పట్టుకొని ఆమె కూడా అతని ప్రక్కనే కూర్చుంది. అతడికేదో అనుమానం వచ్చింది. తిట్లు తినడానికే అలవాటు పడ్డాడు. నెమ్మదిగా అడిగాడు–‘‘అమ్మా! ఏంటి సంగతి?’’ ‘‘రేపు షష్ఠి కదా! నాక్కొన్ని పళ్ళు తెచ్చి పెట్టు’’ అన్నది తల్లి. చప్పుడు చేస్తూ గ్లాసుని క్రింద పెట్టాడు. కోపంగా లేచాడు. ‘‘నాకు తెలుసు. నేను తేలేను. ఎవరి చేతనో తెప్పించుకో. నేనొక ఆటలో పాల్గొనాలి’’ అతడు త్వరగా బయట పడాలని భావించాడు. ‘‘మరి మజ్జిగా తాగవా?’’ ‘‘ఇవ్వయితే’’ అన్నాడు. అంతే...మరుక్షణంలో తల్లి చిరునవ్వు ముఖం పొగలాగా మాయమైంది. కునుకు నుండి మెలకువ వచ్చింది. ఆ తరువాత నిద్ర పోలేదు. అక్కడికి కొద్దిరోజుల్లోనే తల్లి ఆస్తమాతో చనిపోయింది, ఆమెకు సరైన వైద్యం అందించలేకపోయాడు. ఆమె జీవించి వున్నంతకాలమూ ఇంటి వ్యవహారాలు చూసుకునేది. అతడికి ఏ లోటూ వుండేది కాదు. అందరి తల్లుల్లాగే ఆమె కూడా కొండంత సహనం గల మాతృమూర్తి. ఆమె మరణించగలదని రాజా ఊహించలేకపోయాడు. అతడి హృదయంలో ఆమె ఎప్పుడూ జీవించి వుంటుంది. తప్పుల్ని క్షమిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది. బాగా పరిచయమైన పరిసరాలు అతడ్ని ఎంతో సంతోషంతో నింపాయి. సాయంకాలమే అయినా మేఘాల్లోంచి హఠాత్తుగా సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. నేల మీద పచ్చగడ్డి పైన నీటిబిందువులు మెరవసాగాయి. అతడికి వసంతకాలమంటే ఎంత ఇష్టమో గుర్తు వచ్చింది. మేఘాలు కనిపిస్తే చాలు ఉత్తేజితుడైపోతాడు. కాళిదాసు, రవీంద్రనాథ్ టాగోర్‌ల వానపాటలు అతడ్ని పిచ్చెక్కిస్తాయి. ఎంత ఆశ్చర్యం? ఇంతకాలం అతడెక్కడికి పోయాడు? ఇవన్నీ ఎలా మరిచిపోయాడు? ఇది అతడికి ప్రీతిపాత్రమైన ప్రదేశం. అదిగో కవిరాజ్ బనమాలి గారి ఇంటి ముందరి గది. ఆ తరువాత ఇరుగు పొరుగు ఇళ్ళు వరుసగా వున్నాయి. అందులో ఒక ఇంటి రెండో అంతస్తులో తన తల్లిదండ్రులతో గౌరి వుండేది. ఇంకా ఆమె అక్కడే వుందా? గౌరి అక్కడ సహ విద్యార్థిని. గంభీరంగా, ప్రశాంతంగా బంగారు రంగులో మెరిసే కళ్ళతో వుండేది. అందగత్తె కాదుగానీ ఆమెలో అతడికి ప్రత్యేకమైన ఆకర్షణ కనబడేది. చిన్నగా సన్నగా ఆమె ఎప్పుడూ సిగ్గుపడుతూ మాట్లాడినా అతడి చెవులకు అది శ్రావ్యమైన సంగీతంలా వుండేది. వారిద్దరి మధ్యా ఏమి లేదనే మాట నిజం. కాని వారి స్నేహం గురించి శ్రావ్యమైన సంగీతంలా వుండేది. కాని వారి స్నేహం గురించి కాలేజీలో గోడ కవులు చిలవలు పలవలు అల్లేరు. మరో మలుపు తరువాత ఒకనాటి తను నివసించిన ఇంటిని దాటి పోయాడు. ఆ ఇంటినే అతడు అమ్మేశాడు. ఇంటి వాకిట్లో చిన్న కుర్రాడు ఆడుకొంటున్నాడు. ఒక యువతి ఒక పదమూడేళ్ళ అబ్బాయిని జామచెట్టు ఎక్కమని ప్రోత్సహిస్తున్నది. ఆ చెట్టు మీదనే అతడి బాల్యం గడిచింది. ఇప్పడా ఇంట్లో వున్న వారు కొత్త ముఖాలు. వీధుల్లో దీపాలు వెలిగాయి, ప్రధాన వీధి ముఖద్వారం వద్దనే ఒక ఇంటిలో సునీల్ వుంటాడు. ఆ ఇంటిలోంచి కాంతిచారలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇంటిలోంచి ఉరుముల్లాగా పెద్దగా నవ్వులు నేలని కుదిపేస్తున్నాయి. మెట్లెక్కి లోపలికెళ్ళాడు. రాజాని గుర్తించగానే ఎనిమిది గొంతులు అతడ్ని స్వాగతించాయి. ‘‘ఎవరూ? రాజా? రాజానే!’’ ‘‘రాజా వచ్చాడు. రాజా వచ్చాడు’’ ఒకనాటి మిత్రుడ్నీ, గత కొన్నేళ్ళుగా తప్పిపోయి చిరునామా కూడా తెలియకుండా పోయిన స్నేహితుడ్నీ, ఊహించని ఒకనాటి సహచరుడ్నీ చూసి అందరూ ఉవ్వెత్తున సంబరపడిపోయారు. నేల మీద అదే తివాచీ వుంది. ఇంటి ముందర అదే సైన్బోర్డ్. రంగు వెలిసింది కాని ఇంకా మెరుస్తున్నది. ముందరి తలుపు మీద ‘జ్వాలా వలయం’ స్థాపించినప్పుడు అతడు రాసిన గీతమే వున్నది. అక్కడ సునీల్, ఆనంద్ వున్నారు. బుద్ధా ఒక మూలనున్నాడు. బిమల్ తివాచీ మీద కూర్చొని వున్నాడు. ఇంకా ఇతర మిత్రులూ వున్నారు. రాజా అందర్నీ ఒకసారి తేరిపార చూశాడు. ఎవరిలోనూ పెద్దగా మార్పు కనబడలేదు. ‘‘అద్భుతం! రాజా! నాతో కూర్చో. కొద్దిగా టీ తీసుకో’’ ‘‘అయితే రాజా! ఉత్తరం అందిందన్నమాట’’ ‘‘అందుకేగా వచ్చింది’’ అన్నాడు రాజా. ‘‘రాజా! నేనీరోజు కొత్తగీతం రాశాను. నువ్వు విని తీరాలి’’ అన్నాడు అమర్. ‘‘ఆగండి! రాజా రైలు దిగి వచ్చాడు. ఊపిరి పీల్చుకోనివ్వండి’’ అన్నాడు బుద్ధా. రాజా స్థిమితపడ్డాడు. అమర్ వినిపించిన గీతాన్ని విన్నాడు. ఆనందా తిండిపోతు. అజీర్తితో బాధపడుతుంటాడు. అతడి అనారోగ్యపు వివరాలన్నీ విన్నాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. జితిన్ కలెక్టరయ్యాడు. ఛోటా కొకా ప్రొఫెసరయ్యాడు. ఆనందా వ్యాపారం చాలాబాగుంది. సునీల్ విద్యార్థి ఉద్యమానికి ఇంకా నాయకత్వం వహిస్తున్నాడు. బుద్ధా ఒక చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. గౌరి గురించి కూడా తెలిసింది. ఆమె పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది. రాజా ఒక పెద్ద దిండుకు చేరబడి కన్నులు మూసుకున్నాడు. ఇప్పుడతడు కలలు కనడం లేదు. మిత్రుల మధ్య, బాగా పరిచయమైన ప్రపంచంలో సంతృప్తిగా కూర్చున్నాడు. భూగోళం మీద ఎక్కడ వున్నాసరే ప్రతిసంవత్సరం ఇదేరోజున ఇక్కడ సమావేశమౌతుంటారు. ఆ వివరాల్ని సునీల్ చెబుతున్నాడు. ఆ ఎనమండుగురు మాత్రమే వస్తుంటారు. వేరేవరూ రారు. రాజా ఉనికి తెలీదు. అతడు ఇప్పుడు చేరాడు. ‘‘నా చిరునామా మీకెలా తెలిసింది?’’ ‘‘నువ్వు కొద్దిరోజుల క్రితం సరోజ్ని కలిశావట కదా’’ . రాజాకు గుర్తొచ్చింది. సురోజ్ సునీల్ పెద్ద తమ్ముడు. రెండు నెలల క్రితం కలకత్తాలో ట్రామ్‌లో కలిశాడు. చిరునామా అడిగి వుంటాడు. తను చెప్పి వుంటాడు. తన ఉనికి గురించి నిజం ఎందుకు చెప్పాడో అతనికే తెలియదు. సరోజ్ ఆ చిరునామాను వాళ్ళకి అందచేశాడన్నమాట. ‘‘సరే, చిరునామా విషయం మరిచిపో. వాస్తవానికి మన అందిరిలో చురుకైనవాడివి, తెలివైన వాడివి నువ్వే. ఇన్ని సంవత్సరాలు ఏంచేస్తున్నావు? ఎలా వున్నావు?’’ అందరూ ముక్తకంఠంతో అడిగారు. రాజా మిత్రుల ముందర అబద్ధాలతో కూడిన అందమైన కథని అల్లాడు. అతడు మధ్యప్రదేశ్‌లో ఒక మైనింగ్ ఆఫీసర్‌గా చేస్తున్నాడు. హఠాత్తుగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఎవర్నీ ఆహ్వానించడానికి సమయం లేకపోయింది. భార్య ముచ్చటగా వుంటుంది. ఒక కుమారుడు కూడా పుట్టాడు. గత రెండు నెలలుగా సెలవుల మీద కలకత్తాలో వుంటున్నాడు. ప్రస్తుతం తన అత్తవారింటికి వెళ్ళాల్సివుంది. అక్కడొక పెళ్ళికార్యక్రమానికి హాజరు కావాలి...ఇలా రాజా ఎన్నో కల్పిత విశేషాలు చెప్పుకొన్నాడు. రాజా...జ్వాలావలయం స్థాపకుడు రాజా...విద్యార్థినాయకుడు రాజా...మిత్రుల దృష్టిలో ఉన్నతుడైన రాజా, వాళ్ళందరికీ గర్వకారణమైన రాజా...అటువంటి వాడ్ని ఎంతో కాలం తరువాత చూస్తున్నారు. అతడ్ని గురించి వివరాలు వింటున్నారు. రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి ఒకే గదిలో, ఒకే రగ్గులో నిద్రపోయారు. రాజా కనులు మూసుకున్నాడేగానీ మనస్సు ఉరకలు వేస్తున్నది. మధురం...జీవితం మధురం....ఆపాత జ్ఞాపకాలు ఇంకా మధురం. ఈరోజు నుంచి తానొక నూతన యాత్ర ప్రారంభించాలి. తాగడం మానేయాలి. దొంగతనాలు మానేయాలి. నేరగాళ్ళ సహవాసాన్ని తుంచేయాలి. కలకత్తా కూడా వెళ్ళకూడదు. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. నీతిగా తలెత్తుకొని తిరగాలి. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. ఈ శాశ్వతసౌందర్యసీమలో పరిపూర్ణమైన కీర్తిగౌరవాలతో తనని తను పునఃప్రతిష్ఠించుకోవాలి. రాజా ఒకవైపు నుండి మరోవైపు ఒత్తిగిల్లాడు. బుద్ధా గురక పెడుతున్నాడు. తిరుగు రైలు ఉదయం అయిదు గంటలకే బయల్దేరుతుంది. నాలుగున్నరకే సునీల్ నిద్ర లేపాడు. రాజా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆకాశం మేఘావృతంగా వున్నది. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంతమంది ఆత్మీయుల మధ్యకు తిరిగి వచ్చేయడమే మేలని మరోసారి తీర్మానించుకున్నాడు. బయల్దేరే సమయం ఆసన్నమైంది. బుద్ధా, ఆనందా గాఢనిద్రలో వున్నారు. వాళ్ళని మేల్కొలపడం అతనికిష్టం లేదు. ఎలాగు త్వరలోనే వచ్చేస్తాడు. మారిన మనిషిగా తిరిగి జీవితం ప్రారంభిస్తాడు. రాజాకు తన షర్ట్ కనబడలేదు. అక్కడున్న దుస్తులన్నీ తొలగిస్తూ తన చొక్కా కోసం వెతకడం మొదలుపెట్టాడు. సునీల్ తల్లిగారు ఇచ్చిన అల్పాహార పొట్లం తీసుకొని, అతడ్ని తోడ్కొని రాజా స్టేషన్‌కు వెళ్ళాలి. ఇంకా తన షర్ట్ కోసం వెదుకుతూనే వున్నాడు. అంతలోనే అక్కడ నీలి చొక్కా క్రింద తన చొక్కా పడి వున్నది. దాన్ని పైకి తీసాడు. నీలిచొక్కా జేబులోంచి ఏదో బరువుగా పడింది. మనీ పర్స్! బాగా ఉబ్బెత్తుగా ఉన్న పర్స్. రాజా వేళ్ళు తిమ్మిరెక్కాయి. అసంకల్పితంగానే ఆ పర్స్‌ను పైకి తీసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతడి గుండె గట్టిగా కొట్టుకున్నది. నిద్రపోతున్న మిత్రుల వైపు చూస్తూనే పర్స్ తెరిచాడు. దాన్నిండా కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు. ఇది ఆనందాది కావచ్చు. అతడు తన దుకాణం నుంచి తెచ్చుకున్న నగదు కావచ్చు. రాజా ఆ పర్స్‌ని తిరిగి నీలిచొక్కా జేబులో పెట్టేసాడు. తన చొక్కాని వేసుకున్నాడు. కానీ రాజా తలలో ఏదో పురుగు తొలచడం మొదలైంది. తాగడానికి అలవాటు పడిన నాలుక పిడచకట్టుకుపోయింది. దానర్థం మిత్రులందరి ముందూ అలనాటి తన అందమైన గతాన్ని తుడిచి వేయడమేనా? తన నిజస్వరూపం వెల్లడించడమేనా? పునఃప్రారంభించాలని భావిస్తున్న కొత్తజీవితం తిరిగి మరుగున పడిపోవడమేనా? మంచుపొరలు తెరలు తెరలుగా పైకి లేస్తున్నాయి. రాజా ఇంత డబ్బుని గతంలో ఎప్పుడూ కళ్ళ చూడలేదు. అతడి ముఖంలో చిరునవ్వు వికసించింది. సునీల్, ఆనందా, గౌరీ...మొదలైన స్నేహితులు అందరి ముఖాల్నీ పొగమంచు కబళించింది. చీకటి తొలగినట్టే తొలగి మంచుతో మరింత చిక్కనైపోయింది. అప్పటికే రాజా కోసం తన తల్లి ఇచ్చిన అల్పాహార పొట్లాన్ని పట్టుకొని సునీల్ బయట వేచివున్నాడు. ‘‘రాజా! రా! ట్రైన్ టైమ్ అవుతోంది. ఆలస్యం చేయకు’’ అని పిలుస్తున్నాడు. రాజా, ‘‘ఇదిగో వచ్చేస్తున్నాను...’’ అన్నాడు. కానీ నాలుక మడతపడింది. మాట తడబడ్డాడు. అక్షరక్రమం మారింది. గుటకలు వేశాడు. ఆనంద వైపు నిశ్చలంగా జాగ్రత్తగా చూశాడు. నీలిరంగు జేబులోంచి తిరిగి ఆ పర్సుని తన సన్నని నైపుణ్యంగల వేళ్ళతో లాఘవంగా పైకి తీశాడు. ∙ బెంగాలీ మూలం : రిత్విక్ ఘటక్ (ప్రముఖ సినీదర్శకుడు) అనువాదం: టి.షణ్ముఖరావు -
జనవరి 31.. ప్రేమికుల దినోత్సవం!
ప్రేమికుల దినోత్సవం ఎప్పుడంటే.. ‘ఫిబ్రవరి 14’ అని ఎవరైనా చెబుతారు. మరి.. జనవరి 31 అన్నారేంటి అనుకుంటున్నారా? కమల్‌హాసన్‌కి మాత్రం ప్రేమికుల దినోత్సవం అంటే జనవరి 31. ఎందుకు అలా అంటున్నారంటే.. తన స్కూల్ మేట్స్‌ని ఆయన ఆ రోజునే కలుసుకున్నారు. చెన్నైలోని ‘సార్ ఎం.సి.డి. ముత్తయ్య చెట్టియార్ బాయ్స్ హయర్ సెకండరీ స్కూల్’లో కమల్ చదువుకున్నారు. ఇటీవల రీయూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. కమల్ తన స్నేహితులందరినీ కలిశారు. ఆ ఫొటోను షేర్ చేసి, ‘‘జనవరి 31ని నేను ‘లవర్స్ డే’ అంటాను. ఎందుకంటే మా బ్యాచ్‌లో స్నేహాన్ని, లక్ష్యాలను, జ్ఞానాన్ని, దేవుళ్లను, విద్యను.. ఇలా పలు అంశాలను ప్రేమించేవాళ్లు ఉన్నారు. నేర్చుకోవడానికి హద్దు అంటూ ఏదీ లేదు. మనం (స్నేహితులను ఉద్దేశించి) ఇంకా నేర్చుకుంటూనే ఉందాం. మిమ్మల్ని కలవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని పేర్కొన్నారు. -
చిరు ఇంట్లో అలనాటి తారల సందడి
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్, ప్రభు, భానుచందర్, మోహన్‌లాల్, రెహమాన్, వెంకటేశ్, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. అలాగే రాధిక శరత్‌కుమార్ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అ‘పూర్వ’ కలయిక
సాక్షి, హైదరాబాద్ : చదువు నేర్పిన గురులకిది మా వందనం అంటూ.. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలచుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆనాటి మిత్రులను కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. యవ్వనంలో చేసిన అల్లర్లను.. నడి వయసులో మరో సారి గుర్తు చేసుకున్నారు. ఉన్నత శిఖరాలు, పదవులు అధిరోహించినప్పటికీ, అవన్నీ వదిలేసి మరోసారి విద్యార్థులుగా మారిపోయారు. ఆత్మీయత, అనురాగాల మధ్య ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 1968 - 69 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నుంచి 23 వరకూ ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. 50 ఏళ్ల తర్వాత ఆనాటి మిత్రులను కలుసుకుంటున్న ఈ కార్యక్రమానికి కొందరు తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీకి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఈ విషయం గురించి ప్రిన్స్‌పాల్‌తో చర్చించారు. ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకునేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక మీదట తరచుగా ఇలా మిత్రులందరూ కలుస్తుండాలని నిర్ణయించుకుని సెలవు తీసుకున్నారు. -
68 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్ సియంకు అదృష్టవశాత్తు లభించింది. ప్రస్తుతం 92 ఏళ్ల వయస్సు గల ఆ తల్లి 72 ఏళ్ల వయస్సు గల తన కొడుకును సోమవారం నాడు కలుసుకొంది. ఆ వృద్ధ తల్లి తన రెండు చేతులను ఆప్యాయంగా చాచగా, కొడుకు వచ్చి తల్లిని హత్తుకుంటాడు. తనతోనే ఉత్తర కొరియాలో ఉండిపోయి ఎప్పుడో చనిపోయిన తన తండ్రి ఫొటోను కూడా లీ సంగ్ ఈ సందర్భంగా తల్లికి చూపిస్తారు. ఆ ఫొటోను చూసిన తల్లికి పాత జ్ఞాపకాలతో కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ తల్లీ తనయుల అరుదైన కలయికకు సంబంధించిన సన్నివేశాన్ని వీడియో తీసిన సీఎన్ఎన్ ఛానల్ దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొరియన్ల యుద్ధం సందర్భంగా విడిపోయిన రక్త సంబంధీకులు తిరిగి కలుసుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే గత మూడేళ్ల కాలంలో రక్త సంబంధీకులు ఇలా కలుసుకోవడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో 89 మంది వృద్ధులు ఇలా తమ పిల్లలను కలుసుకోవడం కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లీ కియమ్‌కు తనయుడిని కలుసుకునే అవకాశం లభించింది. అది గట్టి నిఘా మధ్యన. తల్లి కొడుకులు కలుసుకున్న ఆనందం కూడా వారికి ఎక్కువ సేపు ఉండదు. మూడు రోజుల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే రక్తసంబంధీకులను కలుసుకునే అవకాశాన్ని దక్షిణ కొరియా కల్పిస్తోంది. ఆ తర్వాత దక్షిణ కొరియా పౌరులు తమ దేశానికి తరలిపోవాల్సిందే. -
68 ఏళ్ల తర్వాత తల్లీ తనయుల అరుదైన కలయిక
-
24 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ...
బీజింగ్ : ఆ తల్లిదండ్రుల 24 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. మూడేళ్ల ప్రాయంలో తప్పిపోయిన తమ కూతురిని ఎట్టకేలకు కలుసుకున్నారు. సుఖాంతంగా ముగిసిన ఈ కథనం వివరాలు...చైనా సిచుయాన్ ప్రోవిన్స్‌లోని చెంగ్డుకు చెందిన మింగ్‌క్వింగ్ కుమార్తె 1994లో తప్పిపోయింది. నాటి నుంచి మింగ్‌క్వింగ్ తప్పిపోయిన తన కూతురి ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తమ కుమార్తె పోస్టర్లను ప్రచురించాడు. పిల్లల ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో వెతికారు. ఆమె జాడ కనుక్కొడానికి ఏ ఒక్క ప్రయత్నాన్ని వదల్లేదు. అయినా ఫలితం లేకపోవడంతో 2015 నుంచి కొత్త దారిలో వెతకడం ప్రారంభించారు. 2015నుంచి మింగ్‌క్వింగ్ టాక్సీ నడపడం ప్రారంభించాడు. తన టాక్సీ ఎక్కడానికి వచ్చే ప్రయాణికులకు తప్పిపోయిన తన కూతురు గురించి చెప్పేవాడు. ఇలా దాదాపు 17వేల మందికి తన కూతురు గురించి చెప్పాడు. ఇంటర్నెట్ ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సిందిగా వారందరిని కోరాడు. కుమార్తె ఫోటోతో కూడిన వివరాలను తన టాక్సీ మీద ప్రదర్శించాడు. ఎట్టకేలకు ఆ తండ్రి ప్రయత్నం ఫలించి తన కూతురు కాంగ్ యింగ్‌ను కనుక్కోగలిగాడు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు తమ కూతురు రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం కాంగ్ యింగ్ తల్లిదండ్రులను చేరుకోనుంది. -
అలనాటి అందాల తారలు
80లలో సినీరంగంలో హీరోలు, హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది తారలు ప్రతీ ఏటా కలిసి పార్టీ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం ఓ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళల, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ గెట్ టు గెదర్ కన్నుల పండుగగా జరిగింది. 28 మంది దక్షిణాది తారలు ఇందులో పాల్గొన్నారు. అలనాటి అందాల తారలంతా ఒకే థీమ్ దుస్తుల్లో దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగు స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్ లతో పాటు శరత్ కుమార్, నరేష్, భాను చందర్, సురేష్, భాగ్యరాజ... హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు. -
ఆ స్పైసీ గాళ్స్ అంతా మళ్లీ కలుస్తున్నారు
లాస్ ఎంజిల్స్: వారు పేరుకే అమ్మాయిలు.. కానీ స్టేజీ మీదకు వచ్చారో చెవులు చిల్లులు పడేలా కేరింతల మోతలుంటాయి. చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా హుషారుతో చిందులేయాల్సిందే. పాట అందుకున్నారంటే పరవశమవ్వక తప్పదు. వారే ఆల్ గర్ల్స్ బ్యాండ్ స్పైస్ గర్ల్స్. వచ్చే ఏడాదిలో ఒక రోజు వీరంతా ఓ చోట చేరనున్నారు. ఏదో ఒక ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలిసి పనిచేసి వీరంతా వచ్చే సంవత్సరం 20వ పునస్సంగమ వేడుకను జరుపుకోనున్నారు. స్పైసీ గర్ల్స్ అంటే ఓరకంగా బ్యాండ్ కలిగిన చీర్ లీడర్స్ లాంటివారన్నమాట. వీరికి బ్యాండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఏవైన ప్రముఖ జాతీయ లేక అంతర్జాతీయ వేడుకల్లోనే తమ అందాలను ఆరబోస్తూ దుమ్మురేపే స్టెప్పులతో, పాటలతో క్రీడాకారులను, ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించడం వీరి ఆనవాయితీ. ఒకసారి ఒక ఈ వెంట్లో పాల్గొన్న వీరంతా మరో ఈవెంట్ వరకు కలిసే అవకాశాలు తక్కువ. అందుకోసమే వీరంతా వీలయినప్పుడల్లా ఒక ప్రత్యేక రోజును కేటాయించుకుని ఆ రోజు కలుసుకుంటారు. ఈ సందర్భంగా ది డెయిలీ స్టార్ మాజీ స్పైసీ గర్ల్ ఎమ్మా బంటన్ మాట్లాడుతూ తమ తరుపున జరిపే 20వ పునస్సంగమ వేడుక వచ్చే ఏడాది జరుపుకోనున్నామని తెలిపారు. తామంతా మరోసారి ఒకరినొకరం కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరం ఎవరి ప్రేమల్లో వారున్నామని, ఓ ఇంటివాళ్లం కూడా అయ్యామని, గతంలో చివరిసారి 2012 ఒలింపిక్స్ గేమ్స్ వేడుకల్లో కలుసుకున్నట్లు తెలిపారు.