జనవరి 31.. ప్రేమికుల దినోత్సవం! | Kamal Haasan IS reunion with his schoolmates | Sakshi
Sakshi News home page

జనవరి 31.. ప్రేమికుల దినోత్సవం!

Published Tue, Feb 4 2020 3:20 AM | Last Updated on Tue, Feb 4 2020 3:20 AM

Kamal Haasan IS reunion with his schoolmates - Sakshi

క్లాస్‌మేట్స్‌తో కమల్‌హాసన్‌

ప్రేమికుల దినోత్సవం ఎప్పుడంటే.. ‘ఫిబ్రవరి 14’ అని ఎవరైనా చెబుతారు. మరి.. జనవరి 31 అన్నారేంటి అనుకుంటున్నారా? కమల్‌హాసన్‌కి మాత్రం ప్రేమికుల దినోత్సవం అంటే జనవరి 31. ఎందుకు అలా అంటున్నారంటే.. తన స్కూల్‌ మేట్స్‌ని ఆయన ఆ రోజునే కలుసుకున్నారు. చెన్నైలోని ‘సార్‌ ఎం.సి.డి. ముత్తయ్య చెట్టియార్‌ బాయ్స్‌ హయర్‌ సెకండరీ స్కూల్‌’లో కమల్‌ చదువుకున్నారు.

ఇటీవల రీయూనియన్‌ ఏర్పాటు చేసుకున్నారు. కమల్‌ తన స్నేహితులందరినీ కలిశారు. ఆ ఫొటోను షేర్‌ చేసి, ‘‘జనవరి 31ని నేను ‘లవర్స్‌ డే’ అంటాను. ఎందుకంటే మా బ్యాచ్‌లో స్నేహాన్ని, లక్ష్యాలను, జ్ఞానాన్ని, దేవుళ్లను, విద్యను.. ఇలా పలు అంశాలను ప్రేమించేవాళ్లు ఉన్నారు. నేర్చుకోవడానికి హద్దు అంటూ ఏదీ లేదు. మనం (స్నేహితులను ఉద్దేశించి) ఇంకా నేర్చుకుంటూనే ఉందాం. మిమ్మల్ని కలవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement