కోవిడ్ కాలంలో బిగ్‌బాస్ షో ఉంటుందా? ఉండదా? అన్న తరుణంలో కింగ్ నాగార్జున నాల్గో సీజన్‌ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లను తీసుకువచ్చినా వారితోనే షోను రక్తికట్టించి విజయవంతంగా నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడిక సీజన్‌కు శుభం కార్డు వేసే సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఓట్లు వేస్తూ కంటెస్టెంట్ల మీద అభిమానం కురిపించిన ప్రేక్షకుల చేతిలోనే వారి గెలుపు ఆధారితమై ఉంది. ఇదిలా వుంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికోసం పెద్ద పెద్ద స్టార్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్లతో స్టెప్పులేయించనున్నారు. అలాగే మాజీ కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులతో హోరెత్తించనున్నారు. (చదవండి: అభి ఫ్యాన్స్‌ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు)
ఎలిమినేట్ అయినవారి రీ ఎంట్రీ!
అయితే ఈ సంబరాలన్నీ జరగడానికి ముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంతా హౌస్‌లోకి వెళ్లి పార్టీ చేసుకుంటారు కదా! ప్రతి సీజన్‌లో పార్టీ పక్కాగా ఉంటోంది కానీ, ఈసారి మాత్రం పార్టీ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోయిన వారు ఎవరిపనుల్లో వారు పడిపోయారు. వారిని మళ్లీ క్వారంటైన్‌లో ఉంచి లోపలకు పంపించేంత సమయం లేదు. దీంతో రీయూనియన్ ఉంటుందా? ఉండదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియన్ 17, 18వ తేదీల్లో ఉండబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: ఆరేళ్లు రిలేషన్‌షిప్, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా)
చివరిసారి అందరూ కలుస్తారా?
ఒకవేళ అదే నిజమైతే ఇదివరకు కంటెస్టెంట్ల ఫ్యామిలీలను ఓ గాజు తెరలో ఉంచి మాట్లాడించినట్లుగా ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అవకాశముంది. లేదంటే గత సీజన్ల కంటెస్టెంట్లు శ్రీముఖి, హరితేజ, గీతామాధురి, అలీ రెజాలతో ఇంట్లో వారికి ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశాన్ని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతైనా పార్టీ టచ్ ఉండాలంటే అందరూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అని బిగ్‌బాస్ నిశ్చయించుకుంటే మాత్రం ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి లోపలకు వెళ్లేందుకు పచ్చజెండా ఊపేస్తారు. దీనివల్ల ఫైనలిస్టులతో పాటు కంటెస్టెంట్లు అందరూ చివరిసారిగా బిగ్‌బాస్ హౌస్‌లో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే అవకాశం దొరకుతుంది. (చదవండి: ఆ హౌజ్‌మెట్‌కే నా మద్దతు: విజయ్ దేవరకొండ)
Comments
Please login to add a commentAdd a comment