బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 4 సీజన్‌లో పాల్గొనే చాన్స్ కొట్టేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో వరస వీడియోలు, రీల్స్‌తో పాటు హాట్‌హాట్ ఫొటోషూట్‌లు షేర్ చేస్తోంది.
చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి
ఈ క్రమంలో ఆమెకు అభిమానుల సంఖ్యతో పాటు ట్రోలర్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలపై ఓవరాక్స్ ఎక్కువైందంటూ విమర్శించడమే కాకుండా బుడ్డది, పొట్టిది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీసెంట్‌గా ఆ ట్రోల్స్ స్పందించిన హారిక ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రోలర్స్‌కు అవకాశం ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
తన నటన ప్రతిభను చూపిస్తూ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ.. దానికి ఎక్స్‌ప్రెషన్ క్వీన్ (Expresstion Queen) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది హారిక. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది. దీంతో అది చూసిన ట్రోలర్స్ హరీకను ఆడేసుకుంటున్నారు. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పాపల బిల్డప్ ఇచ్చావు.. కాస్తా స్పెల్లింగ్ చూసుకోమ్మా’ అని ‘ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా ఇంగ్లీష్ పాప’ అంటూ సటైరికల్‌గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనన ఇలా ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు.
చదవండి: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్‌పై వరస సటైరికల్ ట్వీట్స్
ఇంత చిన్ని విషయానికే ఆమెకు నెటిజన్ల ఎందుకు టార్గేట్ చేశారంటే.. బిగ్‌బాస్ హౌజ్‌లో తరచూ ఇంగ్లీష్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కు హారిక కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎక్కువగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పిన హారిక మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా.. తెలుగు తక్కువగా మాట్లాడేది. బెసిగ్గా ఆమె తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడానికి ఆమె ఇష్టపడటంతో ప్రేక్షకుల అసహనానికి గురైంది. అంతేకాదు హోస్ట్ నాగార్జున సైతం ప్రతివారం తెలుగులోనే మాట్లాడు హారిక అంటూ నొక్కి మరి చెప్పేవారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ హెచ్చరించిన హారిక తన తీరును మాత్రం మార్చుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment