బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
‘‘ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సోహైల్ ఇటీవల 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment