Dethadi Harika Warning Trollers Who Comment On Her Height - Sakshi
Sakshi News home page

Dethadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా, అర్థమైందా?

Published Sun, Feb 13 2022 10:50 AM | Last Updated on Sun, Feb 13 2022 12:09 PM

Dethadi Harika Warning Trollers Who Comment On Her Height - Sakshi

వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌తో క్రేజ్‌ సంపాదించుకుంది దేత్తడి హారిక. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు, నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ యూట్యూబ్‌ స్టార్‌ బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వెళ్లింది. ప్రైవేట్‌ అల్బమ్స్‌తో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే హారికకు ఈ మధ్య కామెంట్ల బెడద ఎక్కువైంది.

ఆమె ఫొటోను చూసి హైట్‌ గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. పొట్టిది, బుడ్డది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఇష్టారీతిన కామెంట్లు పెట్టేవారికి గట్టి కౌంటరిచ్చింది హారిక. ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి అని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. అదీ.. అర్థమైంది కదా.. అని ట్రోలర్స్‌కు వార్నింగ్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement