
సోహైల్.. బిగ్‌బాస్ షోకు ముందు ఇతడెవరో కూడా జనాలకు తెలీదు. కానీ బిగ్‌బాస్ నాలుగో సీజన్ తర్వాత కథ వేరే ఉంది. ప్రేక్షకుల్లో ఇతడికి విశేష గుర్తింపు, స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతో, మాటతో, చేష్టలతో, అరియానాతో గొడవలతో.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఈ షో తర్వాత పలు సినిమాలకు సంతకం చేసి షూటింగ్స్‌తో బిజీబిజీగా మారాడు. తాజాగా సోహైల్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటిరోజులను గుర్తు చేసుకున్నాడు.
'ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కవుట్ కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఏమీ సెట్టయితలేదు, నా లైఫ్ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నా' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సోహైల్. కానీ బిగ్‌బాస్ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం సోహైల్ లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: పుష్ప 2 నుంచి పవర్‌ఫుల్ డైలాగ్ లీక్
రేవంత్, ఇది నీ దగ్గరే నేర్చుకున్నా: నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment