
80లలో సినీరంగంలో హీరోలు, హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది తారలు ప్రతీ ఏటా కలిసి పార్టీ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం ఓ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళల, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ గెట్ టు గెదర్ కన్నుల పండుగగా జరిగింది. 28 మంది దక్షిణాది తారలు ఇందులో పాల్గొన్నారు. అలనాటి అందాల తారలంతా ఒకే థీమ్ దుస్తుల్లో దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగు స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్ లతో పాటు శరత్ కుమార్, నరేష్, భాను చందర్, సురేష్, భాగ్యరాజ... హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment