తమిళసినిమా: 1980 సంవత్సరంలో ప్రముఖ కథానాయకులు, నాయకిలుగా వెలుగొందిన తారలు కొన్ని ఏళ్లుగా ఏడాదికోసారి ఒక చోట కలిసి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, నటీమణులు రాధిక శరత్‌కుమార్, సుహాసిని, అంబిక, రాధ, లిజి మొదలగు పలువురు నటీనటులు ఏడాదికి ఒకసారి ఒక ఫాంహౌస్‌లాంటి ప్రాంతంలో కలుసుకుని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటుంటారు.
అదేవిధంగా ఈ వీకెండ్‌లో 1980లో ప్రముఖ నాయికలుగా రాణించిన నటీనటులు చెన్నైలో కలుసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని పసందైన విందు ఆరగించి ఆనందంగా గడిపారు. అలా కలుసుకున్న వారిలో నటి రాధిక శరత్‌కుమార్, కుష్బూ, సుహాసిని, రాధ, అంబిక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, నటుడు రఘు వున్నారు. ఫొటోలను నటి రాధిక శరత్‌కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
అందులో ఆమె పేర్కొంటూ 1980లలో ప్రముఖ హీరో హీరోయిన్‌లుగా రాణించిన వారందరూ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా తాము కలుసుకోలేకపోయామని ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుతో ఈ వీకెండ్‌లో మళ్లీ తామంతా కలుసుకుని గత అనుభవాలను, అనుభూతులను పంచుకుని ఆనందంగా గడిపినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఖుష్బూ సుందర్.. ‘‘చాలా చాలా ఎంజాయ్ చేశాం. ఎంతో ఉల్లాసంగా గడిపాం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment