Actress Radhika Wishes Husband Sarath Kumar On His Birthday - Sakshi
Sakshi News home page

Radhika Sarathkumar: బంగారం లాంటి మనిషికి హ్యాపీ బర్త్‌డే

Published Wed, Jul 14 2021 8:12 AM | Last Updated on Wed, Jul 14 2021 1:08 PM

Radhika Warm Birthday Wishes To Husband Sarathkumar - Sakshi

Sarathkumar Birthday: తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌ నేడు(జూలై 14న) 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, నటి రాధిక సోషల్‌ మీడియా వేదికగా భర్తకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 'ఉక్కు మనిషి, బంగారం లాంటి మంచి మనసున్న శరత్‌కుమార్‌కు హ్యాపీ బర్త్‌డే' అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు రాధిక శరత్‌తో కలిసి దిగిన ఫొటోలను మనం చూడొచ్చు. పనిలో పనిగా తన ఫోన్‌ వాల్‌పేపర్‌ను కూడా రివీల్‌ చేసిందీ నటి. అలాగే శరత్‌ తనలోని పాకశాస్త్ర నిపుణుడికి పని చెప్తూ కిచెన్‌లో వంట చేయడం కూడా కనిపిస్తోంది.

కాగా శరత్‌కుమార్‌ 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నెగెటివ్‌ రోల్స్‌ చేసిన ఆయన తర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. 2007లో సొంతంగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. పొలిటికల్‌ రంగంలోనూ శరత్‌ విజయాన్ని సాధించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement