
తమిళసినిమా: సంచలన నటి నయనతార దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2016 నుంచి ఈ జంట సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత జూన్‌లో ఈ ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది.
కాగా ఈ జంట అద్దె తల్లి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ సంచలనం కలిగించారు. పలు వురి విమర్శల మధ్య ఇది ప్రభుత్వం వరకు వెళ్లింది. నయనతార విగ్నేశ్‌శివన్‌లకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సమన్లు జారీ చేయడం, వారు వి వరణ ఇవ్వడం విచారణ వంటి సంఘటన తరువాత అన్నీ సక్రమమే అన్న ప్రత్యేక కమిటీ ప్రకటనతో నయనతార విఘ్నే ష్ శివన్‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు అందించా రు.
తాజాగా నటి రాధికాశరత్‌కుమార్ స్వయంగా స్థానిక ఎగ్మోర్‌లోని నయనతార ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలను చూశారు. అలాగే నయనతార విఘ్నేష్ శివన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, నయనతార కవల పిల్లలు చాలా బాగున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment