వెండితెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో.. బుల్లి తెర మీద కూడా అదే స్థాయిలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్. ఇన్ని రోజుల్లో టీవీ సీరియల్స్‌తో అలరించిన త్వరలో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) విశేష ఆదర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళంలో కేబీసీ మాదిరి ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్‌గా ఉండనున్నారు. అయితే కేబీసీలో మహిళలకు, పురుషులకు అవకాశం కల్పించగా.. కోడీశ్వరిలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనేందకు అవకాశం కల్పించారు. ఈ షో కలర్స్ తమిళ్ చానల్‌లో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించి రాధిక లుక్‌తో కూడిన చిన్న టీజర్‌ను ఆ చానల్ విడుదల చేసింది. కాగా, ఈ షో డిసెంబర్ నుంచి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది.
கலர்ஸ் தமிழ் பெருமையுடன் வழங்கும் உலகத்தின் மிகப்பெரிய வண்ணமயமான "கேம் ஷோ..!!".
— Colors Tamil (@ColorsTvTamil) October 17, 2019
முதல்முறையாகப் பெண்கள் மட்டுமே கலந்துகொள்ளும் ஒரு பிரம்மாண்டமான மேடை 'கோடீஸ்வரி'..!!#ColorsKodeeswari | #ColorsKOD | #ColorsTamil | @realradikaa pic.twitter.com/kt4FetFfaK
అయితే కేబీసీ ఆధారంగా తమిళంలో ఇదివరకే ‘నీంగలుమ్ వెల్లాలుమ్ ఒరు కోడీ’పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్‌రాజ్, అరవింద్‌స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్ట్‌లుగా వ్యవహరించారు. పలు భారతీయ భాషల్లో కూడా కేబీసీ ఆధారంగా ఇప్పటికే షోలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment