సాక్షి, చెన్నై: లోక్‌సభ అభ్యర్థుల కోసం బీజేపీ నాలుగో జాబితా శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 14 స్థానాలకు, అలాగే.. పుదుచ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది.
మొత్తం 16 మందిలో పీ కార్తికేయిని చిదంబరం(ఎస్సీ నియోజకవర్గం) నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది. కార్తికేయిని 2017లో అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరారు. నటి నుంచి పొలిటీషియన్‌గా మారిన రాధికా శరత్‌కుమార్‌కు విరుద్‌నగర్ టికెట్ ఇచ్చింది. రాధిక భర్త శరత్ కుమార్ స్థాపించిన అఖిల ఇండియా సమతువ మక్కల్ కల్చి(AISMK)ను ఈమధ్యే బీజేపీలో విలీనం చేశారు.
బీజేపీ మూడో జాబితా గురువారం రిలీజ్ కాగా.. 9 మంది లిస్ట్‌లో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌తో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలైతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి కూడా టికెట్ కేటాయించారు.
#BJP 2nd list of candidates for TN..
— நிலேஷ் மகாதேவ்🔱 (@NileshMahadev) March 22, 2024
Actress @realradikaa to contest from #VirudhuNagar #LokSabhaElections2024 #AbkiBaar400Paar#TNBJP #INDIAAlliance #nda #TamilNadu #KAnnamalai pic.twitter.com/vPBj6YTX8M
Comments
Please login to add a commentAdd a comment