
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.
(ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!)
తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు.
అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం.
ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్‌లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment