secret relationship
-
ప్రెగ్నెన్సీ తర్వాత ఆ డైరెక్టర్ ముఖం చాటేశాడు : నటి
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను బయటపెట్టి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు మోడల్, నటి మందనా కరిమి భయటపెట్టిన సీక్రెట్ అందరిచేత కంటతడి పెట్టించింది. 'ఓ ప్రముఖ డైరెక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. నా భర్త నుంచి విడిపోయాక ఈ ప్రముఖ దర్శకుడితో నాకు సీక్రెట్ రిలేషన్షిప్ ఏర్పడింది. అతను చాలా ఫేమస్. మహిళల మక్కుల గురించి మాట్లాడే అతడి ఆదర్శ భావాలు నచ్చి తనతో సంబంధం కంటిన్యూ చేశాను. ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం. కానీ ఆ తర్వాత నన్ను ఒంటరిదాన్ని చేసి వదిలేశాడు అంటూ కన్నీరుమున్నీరైంది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని, ఆ సమయంలో స్నేహితులు, సన్నిహితులు తనకు మద్దతుగా నిలిచారని పేర్కొంది. కాగా 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో మందనా వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ఫేమస్ డైరెక్టర్‌తో సీక్రెట్ రిలేషన్లో ఉన్నానని చెప్పిన మందనా అతను ఎవరన్నది మాత్రం చెప్పలేదు. చదవండి: పెళ్లయిన హీరోలు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్!
టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి, నటి త్రిషల సీక్రెట్ ఎఫైర్ ముగిసిందా? పలు కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ఈ జంట విడిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సైమా అవార్డుల కార్యక్రమంలో రానా, త్రిష ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరూ కలసే మలేసియాకు వెళ్లినట్టు సమాచారం. రానా, త్రిష కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. ఈ జంట ఈ రూమర్లను ఖండించినా.. రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు టాలీవుడ్ కోడైకూస్తోంది. అయితే ఇదంతా గతం. రానా, త్రిష తమ బంధాన్ని తెంచుకున్నట్టు తాజా సమాచారం. రానా వేరే అమ్మాయిలతో ఎఫైర్ సాగిస్తున్నాడనే కారణంతో వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. రానా, త్రిష ట్విట్టర్లో పరస్పరం ట్వీట్ చేసుకునేవారు. అయితే కొంతకాలంగా ట్వీట్స్ చేసుకోవడం మానేశారు. ' ఓ కథకు ఎప్పుడూ మూడు కోణాలుంటాయి. నీవైపు, ఎదుటి వారి తరపున వారి వాదనలుంటాయి. నిజమన్నది ఈ రెండింటికీ భిన్నంగా ఉంటుంది" అని ఇటీవల రానా ట్వీట్ చేయగా, 'ఓ వ్యక్తిని మరచిపోవడం సులభం, అయితే మరోసారి ఆ వ్యక్తిని నమ్మడమంటూ ఉండదు" అని త్రిష ట్వీట్ చేశారు. 'నేను బంధాన్ని తెంచుకుంటే, దానికి గల కారణాలను నీవే కల్పించావు' అని త్రిష మరోసారి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌ను బట్టి రానా, త్రిషల మధ్య సీక్రెట్ ఎఫైర్ ముగిసిపోయిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.