రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్! | Trisha-Rana end their secret relationship! | Sakshi
Sakshi News home page

రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్!

Published Mon, Oct 20 2014 4:35 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్! - Sakshi

రానా, త్రిషల సీక్రెట్ ఎఫైర్ కటీఫ్!

టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి, నటి త్రిషల సీక్రెట్ ఎఫైర్ ముగిసిందా? పలు కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచిన ఈ జంట విడిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

సైమా అవార్డుల కార్యక్రమంలో రానా, త్రిష ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరూ కలసే మలేసియాకు వెళ్లినట్టు సమాచారం. రానా, త్రిష కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. ఈ జంట ఈ రూమర్లను ఖండించినా.. రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు టాలీవుడ్ కోడైకూస్తోంది. అయితే ఇదంతా గతం. రానా, త్రిష తమ బంధాన్ని తెంచుకున్నట్టు తాజా సమాచారం. రానా వేరే అమ్మాయిలతో ఎఫైర్ సాగిస్తున్నాడనే కారణంతో వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. రానా, త్రిష ట్విట్టర్లో పరస్పరం ట్వీట్ చేసుకునేవారు. అయితే కొంతకాలంగా ట్వీట్స్ చేసుకోవడం మానేశారు.

' ఓ కథకు ఎప్పుడూ మూడు కోణాలుంటాయి. నీవైపు, ఎదుటి వారి తరపున వారి వాదనలుంటాయి. నిజమన్నది ఈ రెండింటికీ భిన్నంగా ఉంటుంది" అని ఇటీవల రానా ట్వీట్ చేయగా, 'ఓ వ్యక్తిని మరచిపోవడం సులభం, అయితే మరోసారి ఆ వ్యక్తిని నమ్మడమంటూ ఉండదు" అని త్రిష ట్వీట్ చేశారు.  'నేను బంధాన్ని తెంచుకుంటే, దానికి గల కారణాలను నీవే కల్పించావు' అని త్రిష మరోసారి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ను బట్టి రానా, త్రిషల మధ్య సీక్రెట్ ఎఫైర్ ముగిసిపోయిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement