Kangana Ranaut Comments on Ranbir Kapoor and Alia Bhatt Fake Love - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: అతని పెళ్లి ఒక బూటకం.. వాళ్లను నాశనం చేస్తా: కంగనా

Jul 30 2023 4:39 PM | Updated on Jul 30 2023 5:03 PM

Kangana Ranaut Comments On Ranbir Kapoor And Alia Bhatt fake love - Sakshi

నేను డేటింగ్ చేసిన సూపర్ స్టార్ కూడా ఇలాంటి పనే చేశాడు..

బాలీవుడ్ సూపర్‌స్టార్‌లపై కంగనా రనౌత్ తాజాగా భారీ కామెంట్లే చేసింది. హృతిక్ రోషన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి పరోక్షంగా బయటపెట్టింది నటి కంగనా. బాలీవుడ్‌లో ఒక వ్యక్తి తన ప్రతినిధిగా (కంగనా) నటిస్తూ ఇతరులను స్కామ్ చేస్తున్నాడని, వారి సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నాడని కొందరు ఆమెకు చెప్పడంతో కంగనా రియాక్ట్‌ అయింది.

ఒకప్పుడు హృతిక్‌గా నటిస్తూ కొందరు తనకు కూడా పోస్ట్‌ చేశారని అప్పుడు తాను కూడా మోసపోయానని కంగనా గుర్తు చేసుకుంది. బాలీవుడ్ కక్షలు, బంధుప్రీతిపై ఎప్పుడూ తన స్వరం పెంచే కంగనా తాజాగా ఓ బాలీవుడ్ నటుడిని టార్గెట్ చేసింది. ఓ సూపర్ స్టార్ తనను డేట్‌కు రమ్మని అడిగాడని పేరు చెప్పకుండానే చెప్పింది కంగనా. అంతే కాదు పరోక్షంగా మరోసారి హృతిక్ రోషన్‌పై మండిపడింది.

హృతిక్‌ రోషన్‌ని టార్గెట్‌!
హృతిక్ రోషన్‌తో తనకున్న ఎఫైర్ గురించి కంగనా రనౌత్ మరోసారి ఓపెన్ అయ్యింది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పోస్ట్‌లను షేర్‌ చేసింది. తన ఖాతా కూడా హ్యాక్ అయిందని ఆమె ఇలా పేర్కొంది.  'బాలీవుడ్‌ ఫిల్మ్ మాఫియా ఎప్పుడూ నేర కార్యకలాపాలలో పాల్గొంటుంది. గతంలో నేను డేటింగ్ చేసిన సూపర్ స్టార్ కూడా ఇలాంటి పనే చేశాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించాడు.

ఒకానొక సమయంలో అతను నా ఖాతాను కూడా హ్యాక్ చేసి తప్పుగా ఆపరేట్ చేశాడు. ఆ సమయంలో అతను విడాకులు తీసుకుంటున్నాడని నేను అనుకున్నాను, కానీ అతని అనుమానాస్పద ప్రవర్తనకు దానితో సంబంధం లేదని నాకు తరువాత తెలిసింది.' అని కంగనా పేర్కొంది.

'ఫిల్మ్ మాఫియా' తరగతి
బాలీవుడ్‌లో ఇదొక్కటే కాదు, ఒక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే 'ఫిల్మ్ మాఫియా' ఎలా పనిచేస్తుందో కూడా కంగనా ప్రస్తావించింది. 'సినిమా విడుదల అయ్యాక వారు పెద్దమొత్తంలో నకిలీ టిక్కెట్లను కొనుగోలు చేస్తారు. అలా ఆ సినిమా కలెక్షన్స్‌ను తారుమారు చేస్తారు. దానిని జనాలకు ఎక్కువగా చూపుతారు. ఈ మాఫియా ఒక స్పై గా కొందరి కోసం పనిచేస్తుంది. ప్రముఖుల వాట్సాప్ డేటాను కూడా కొనుగోలు చేస్తారు, అలా నా సినిమా ఒప్పందాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తస్కరించారు.

(ఇదీ చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!)

ఈ దోపిడీల గురించి నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను, చెబుతున్నాను. ఇలాంటి పనులు చేసేది ప్రతిభ లేని వారు మాత్రమే. అలాంటి వారు తెలివి తక్కువ వ్యక్తులు.... వారికి నేర ప్రవృత్తి ఉంది... చాలా భయానకంగా ఉంది... @cybercrimehelp.mumbai దయచేసి చర్య తీసుకోండి. అని పరోక్షంగా రణబీర్ కపూర్,  అలియాను కంగనా లాగింది. 

రణబీర్‌పై ఆరోపణలు?
కంగనా మరొక ఇన్‌స్టా కథనంలో ఇలా రాసింది, 'బాలీవుడ్‌లో ఉమనైజర్ అని పిలువబడే మరో సూపర్ స్టార్ నా ఇంటికి వచ్చి అతనితో డేటింగ్ చేయమని అడిగాడు. అయితే దీనిని పూర్తిగా గోప్యంగా ఉంచాలన్నాడు. ఎందుకని కారణాన్ని నేను అడిగినప్పుడు, అతను తాను 'పాపా కి పరి'తో డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు. అంటే వారి మధ్య ప్రేమ లేదు. అతని కోరికకు నేను అంగీకరించలేదు. తిరస్కరించాను. ఆ తర్వాత వివిధ నంబర్ల నుంచి నాకు కాల్ చేయడం ప్రారంభించాడు. అతని నంబర్లన్నీ బ్లాక్ చేశాను.

అప్పటి నుంచి అతను నా సోషల్‌ మీడియా ఖాతాలతో పాటు.. నా ఫోన్లను కూడా  హ్యాక్ చేయడం ప్రారంభించాడు. తర్వాత అది నేను గ్రహించాను. చివరకు తన పెళ్లి కూడా ఒక బూటకం. అతను ఇ‍ష్టంతో పెళ్లి చేసుకోలేదు. తన సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలా ఎత్తుగడలు వేశాడు. అవన్నీ తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత నైతికంగా అవినీతికి పాల్పడతారా అని నమ్మలేకపోయాను.

వాళ్లు మనుషులు కాదు, రాక్షసులు.. అందుకే వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను'. 'ధర్మానికి ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఆధర్మాన్ని నాశనం చేయడమే. ఇదే శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. కంగనా తెలిపిన ఈ స్టోరీలో డైరెక్ట్‌గా  ఎవరి పేరు చెప్పకున్నా పరోక్షంగా రణబీర్ కపూర్, అలియాకు లింక్ అయ్యేలా చెబుతూ వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె అభిమానులు కూడా కామెంట్ల రూపంలో చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement