బొక్కబోర్లా పడ్డ నబీల్‌.. తన సత్తా చూపించిన అవినాష్‌ | Bigg Boss Telugu 8: Sudoku Challenge for Ticket To Finale Contenders | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: టికెట్‌ టు ఫినాలే రేస్‌లో మరో కమెడియన్‌.. నబీల్‌ అవుట్‌!

Published Wed, Nov 27 2024 4:23 PM | Last Updated on Wed, Nov 27 2024 4:58 PM

Bigg Boss Telugu 8: Sudoku Challenge for Ticket To Finale Contenders

టికెట్‌ టు ఫినాలే కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే అఖిల్‌, హారిక వచ్చి గేమ్స్‌ ఆడించగా అందులో కమెడియన్‌ రోహిణి గెలిచి ఫస్ట్‌ కంటెండర్‌గా నిలిచింది. తాజాగా హౌస్‌లో మానస్‌, ప్రియాంక జైన్‌ అడుగుపెట్టారు. వీళ్లు పృథ్వీ, నబీల్‌, ప్రేరణ, అవినాష్‌తో సుడోకు గేమ్‌ ఆడించారు. 

నబీల్‌ అత్యుత్సాహం
ఇందులో నబీల్‌ తాను అందరికంటే ముందు విజయవంతంగా పూర్తి చేసేశాననుకుని సంతోషంతో గెంతులేశాడు. తీరా మానస్‌ వెళ్లి చూస్తే అక్కడ అన్నీ తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ గేమ్‌ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్‌ చిన్న క్లూ వదిలాడు. ఆ క్లూ సాయంతో అవినాష్‌ అందరికంటే ముందు సుడోకు పూర్తి చేశాడు. అతడి విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన నబీల్‌.. అవినాష్‌కు ఏమైనా సాయం చేశావా? అంటూ తేజను ప్రశ్నించాడు. 

కంటెండర్‌గా మరో కమెడియన్‌
అది విని అవినాష్‌ షాకవగా.. ఏమో, అక్కడ జనాలు దగ్గరున్నారని అడిగానంటూ తన కుళ్లు, అనుమానాన్ని బయటపెట్టాడు. మొత్తానికి కమెడియన్‌ అవినాష్‌ తనకు ఇచ్చిన టాస్కులు గెలిచి కంటెండర్‌గా నిలిచాడు. ఎంటర్‌టైనర్లకు టాస్కులు ఆడి గెలిచే సత్తా కూడా ఉందని రోహిణి, అవినాష్‌ నిరూపించారు. ఇకపోతే ఈరోజు నబీల్‌కు బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఇచ్చి అతడిని రేసులో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement